India Post GDS Recruitment 2026: పోస్టల్ శాఖలో 28740 పోస్టులు.. 40 ఏళ్లున్నా అప్లై చేసుకోవచ్చు.. పరీక్ష లేదు
- పోస్టల్ శాఖలో 28740 పోస్టులు
- 10వ తరగతి/మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణులై ఉండాలి
- 40 ఏళ్లున్నా అప్లై చేసుకోవచ్చు
- పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్ ప్రకారం నియామకాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పదోతరగతి పాసై ఖాళీగా ఉన్నారా? ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నారా? అయితే ఈ ఛాన్స్ ను అస్సలు వదులుకోకండి. 40 ఏళ్ల వయసున్నా అప్లై చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 28 వేలకు పైగా గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టుల భర్తీకి ఇండియన్ పోస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. వన్-టైమ్ రిజిస్ట్రేషన్ కోసం చివరి తేదీ ఫిబ్రవరి 14, ఆన్ లైన్ అప్లికేషన్, ఫీజు చెల్లించడానికి చివరి తేదీ ఫిబ్రవరి 16, 2026. అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు నిర్ణీత తేదీలలోపు ఆన్‌లైన్ మోడ్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Also Read:Top Headlines @9PM : టాప్ న్యూస్
Also Read
- CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- యూఎస్ ఓపెన్ 2026 విజేత Alexander Zverev.. తల్లికి భావోద్వేగ నివాళి.!
- Rajasthan Local Body Elections: వసుంధరా రాజే రాజకీయ కోటకు బీటలు.. బీజేపీకి భారీ షాక్..!
- Balapur Ganesh 2026: పూరి జగన్నాథ ఆలయాన్ని తలపించేలా భారీ సెట్టింగ్.. బాలాపూర్ గణేశుడి వద్ద కనువిందు
ఇండియా పోస్ట్ GDS రిక్రూట్‌మెంట్ 2026కి అప్లై చేసుకోవడానికి అభ్యర్థి తప్పనిసరిగా భారతీయ పౌరుడు అయి ఉండాలి.
ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుండి 10వ తరగతి/మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణులై ఉండాలి.
10వ తరగతిలో గణితం, ఆంగ్ల సబ్జెక్టులలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
కనీస వయస్సు 18 సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదు, గరిష్ట వయస్సు 40 సంవత్సరాలు మించకూడదు. రిజర్వ్డ్ కేటగిరీల అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
Also Read:Pawan Kalyan: జనసేన నేతలపై పవన్ కళ్యాణ్ ఫైర్.. తీరు మార్చుకోకపోతే ఉపేక్షించం!
జనరల్, OBC అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటు రూ.100 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. SC, ST, దివ్యాంగ అభ్యర్థులు ఉచితంగా అప్లై చేసుకోవచ్చు. ఈ నియామక డ్రైవ్ 23 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో మొత్తం 28,740 ఉద్యోగాలను భర్తీ చేస్తుంది. నెలకు బీపీఎం పోస్టులకు రూ.12,000 – రూ.29,380; ఏబీపీఎం/ డాక్ సేవక్ పోస్టులకు రూ.10,000 – రూ.24,470 వేతనం ఉంటుంది. అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్ ప్రకారం నియామకాలు చేపడతారు. ఎంపికైన వారికి సమాచారం ఎస్‌ఎంఎస్/ ఈమెయిల్/ పోస్టు ద్వారా అందుతుంది. అప్లై చేసుకోవడానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి. నోటిఫికేషన్ వివరాల కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
తాజావార్తలు
-
Ajit Agarkar-BCCI: బీసీసీఐ కీలక సమావేశం.. అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఉత్కంఠ!
-
Sanju Samson: సంజు శాంసన్.. ముందుంది ముసళ్ల పండగ! అంతా నీచేతుల్లోనే ఇగ!
-
CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
-
Oppo Find X10: ఒప్పో Find X10 సిరీస్‌లో మూడు మోడల్స్.. గ్లోబల్ లాంచ్‌కు సిద్ధం.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ
-
Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!