సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. విజయ్ దేవరకొండ హీరోగా, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మూవీ ‘లైగర్’. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ‘లైగర్’కు పూరి, ఛార్మి, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీతో పాటు ఇతర ప్రధాన భారతీయ భాషల్లోనూ విడుదల కానుంది. తాజాగా “లైగర్” సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమైందని రౌడీ హీరో సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. ఈ రోజు సాయంత్రం గోవాలో జరిగే నైట్ ఎఫెక్ట్‌లో చిత్రీకరించనున్న యాక్షన్ సన్నివేశాల కోసం బృందం భారీ సెట్‌ను ఏర్పాటు చేసింది. ఆ సెట్ విజువల్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. బాక్సింగ్ రింగ్ లో విజయ్ దేవరకొండ కూర్చుని ఉండడం అందులో కన్పిస్తోంది.
Read also : “ఎన్టీఆర్ 30” లాంచ్ కు ముహూర్తం ఫిక్స్
విజయ్ దేవరకొండ ఈ పిక్ ను పోస్ట్ చేసి “రక్తం, చెమట,వయోలెన్స్… లైగర్ షూట్ తిరిగి ప్రారంభం” అంటూ రాసుకొచ్చాడు. ఈ స్పోర్ట్స్ డ్రామా ఈ చిత్రం సెప్టెంబర్ 9 న థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా మేకర్స్ సినిమాను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో సినిమా ఓటిటి లో విడుదలవుతుంది అంటూ వార్తలు వచ్చాయి. ఇటీవల విజయ్ దేవరకొండ ట్విట్టర్‌లో “లైగర్” కు రూ. 200 కోట్ల ఓటిటి డీల్ వచ్చినందంటూ వస్తున్న రూమర్‌ని కొట్టిపారేశారు. ఇది చాలా తక్కువ అని, థియేటర్లలో ఇంకా ఎక్కువ వస్తుందని చెప్పి అంచనాలు పెంచేశాడు.