“ఎన్టీఆర్ 30” లాంచ్ కు ముహూర్తం ఫిక్స్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీకి సంబంధించి ఆయన అభిమానులు ఎగిరి గంతేసే సమాచారం అందింది. దర్శకుడు శివ కొరటాల కాంబినేషన్లో ఎన్టీఆర్ రెండో ప్రాజెక్ట్ రూపొందనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కొరటాల శివ ‘ఆచార్య’ పనులను వేగంగా పూర్తి చేస్తున్నాడు. మరోవైపు ఎన్టీఆర్ “ఆర్ఆర్ఆర్” షూటింగ్ ని పూర్తి చేశాడు. రాజమౌళి కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ చిత్రం ప్రోస్ట్ ప్రొడక్షన్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీపై పడింది. ఎన్టీఆర్, కొరటాల కాంబోలో వచ్చే ఈ మూవీ గురించి అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమాను “ఎన్టీఆర్30” అనే తాత్కాలిక పేరుతో పిలుస్తున్నారు. ఈ పాన్ ఇండియా హీరో, స్టార్ డైరెక్టర్ ఇద్దరూ తమ పనులను వీలైనంత తొందరగా ముగించుకుని “ఎన్టీఆర్ 30″ని ప్రారంభించడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

Read Also : ఫారిన్ లో “సర్కారు వారి పాట”కు టీమ్ రెడీ

ఈ నేపథ్యంలో “ఎన్టీఆర్ 30” లాంచ్ కి ముహూర్తం ఖరారయ్యిందట. తాజా సమాచారం ప్రకారం సినిమా అక్టోబర్ మొదటి వారంలో గ్రాండ్‌గా లాంచ్ అవుతుంది. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఇది ఎన్టీఆర్ కెరీర్‌లో 30 వ సినిమా. అంతకుముందు ఎన్టీఆర్ హీరోగా కొరటాల దర్శకత్వంలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. సుధాకర్ మిక్కిలినేని నిర్మించనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్‌లో ప్రారంభమవుతుంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చనున్నారు. ఎన్టీఆర్ సరసన కియారా అద్వానీ గానీ, లేదంటే అలియా భట్ కానీ హీరోయిన్ గా నటించే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ స్టూడెంట్ లీడర్ గా కన్పించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాను పూర్తి చేశాక ఎన్టీఆర్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను 2022 ద్వితీయార్ధంలో ప్రారంభిస్తాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ ప్రాజెక్ట్ రూపొందనుంది.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-