Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
- కన్యాదానం చేస్తుండగానే కుప్పకూలిన తండ్రి
- పెళ్లి సందడి క్షణాల్లోనే విషాదంగా మారింది
- కూతురి బిడ్వాయ్కి ముందే తండ్రి తుది వీడ్కోలు
- మహారాష్ట్రలో హృదయ విదారక ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wedding Tragedy : కన్నకూతురిని అత్తారింటికి పంపిస్తూ, ఆమె సుఖీభవ అని దీవించాల్సిన ఆ పవిత్ర క్షణమే ఆ తండ్రికి ఆఖరి క్షణమైంది. మహారాష్ట్రలోని బుల్దానా జిల్లా సింధ్‌ఖేడ్ రాజా తాలూకా వరదడి గ్రామంలో జరిగిన ఈ విషాద ఘటన అందరినీ కలచివేసింది. పెళ్లి సందడితో కళకళలాడుతున్న ఆ ఇల్లు క్షణాల్లోనే శోకసంద్రంగా మారింది.
వరదడి గ్రామానికి చెందిన కురుమదాస్ కుండలిక్ భూతేకర్ (50) తన కూతురు నందినికి జల్నా జిల్లాకు చెందిన ప్రదీప్ నానోటేతో వివాహం నిశ్చయించారు. బుధవారం (మే 13) సాయంత్రం వివాహ వేడుకలు ఎంతో ఉత్సాహంగా సాగుతున్నాయి. మంగళావాయిద్యాల మధ్య కన్యాదానం చేసే కీలక ఘట్టం ప్రారంభమైంది. తన కూతురి చేయిని వరుడి చేతిలో పెడుతూ కన్యాదానం చేస్తున్న సమయంలోనే కురుమదాస్కు తీవ్రమైన గుండెపోటు వచ్చింది. దీంట్లో పెళ్లిమండపంలోనే ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే ఆయన్ని ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఐదు నెలల క్రితమే ఆయనకు బైపాస్ సర్జరీ జరిగినట్లు సమాచారం.
Also Read
- Paraglider: మహిళా పారాగ్లైడర్ గాల్లో ఉండగానే.. పారాచూట్ మధ్య నుంచి దూసుకెళ్లిన విమానం.. చూస్తే ఊపిరి ఆడదు (వీడియో)
- Siddipet: బీరు తాగబోతే షాక్.. బాటిల్లో కండోమ్ ప్యాకెట్ ప్రత్యక్షం..
- Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
- Gold Theft: లవర్ సంతోషం కోసం అమ్మ నగలు అమ్మేశాడు.. అసలేం జరిగిందంటే!
తన కూతురి పెళ్లిని అంగరంగ వైభవంగా చేయాలనేది కురుమదాస్ కల. అందుకే పెళ్లి పనులన్నీ దగ్గరుండి చూసుకున్నారు. పసుపు కొట్టే వేడుక నుండి పెళ్లి తంతు వరకు అంతా సంతోషంగానే సాగింది. కానీ కూతురి అత్తారింటికి పంపేలోపే ఆ తండ్రి లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఏ ఇంటి నుండి కూతురి బారాత్ కదలాల్సి ఉందో, అదే ఇంట తండ్రి అంతిమయాత్ర మొదలవ్వడం చూసి బంధువులు, గ్రామస్థులు కన్నీరు మున్నీరయ్యారు.
కురుమదాస్ భూతేకర్ గ్రామంలో మంచి వ్యక్తిగా, కష్టపడే మనిషిగా పేరు తెచ్చుకున్నారు. ఒకవైపు నవ దంపతులు కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్న వేళ, తండ్రి ఇలా అకస్మాత్తుగా దూరం కావడం ఆ కుటుంబంలో తీరని లోటును మిగిల్చింది. కూతురి జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజు ఆమెకు తీరని వేదనను మిగిల్చిన రోజైంది.
తాజావార్తలు
-
Marco Rubio: భార్యతో కలిసి జైపూర్ ప్రసిద్ధ కట్టడాలు సందర్శించిన మార్కో రూబియో
-
Hardik Pandya: MI వీడి చెన్నై సూపర్ కింగ్స్‌లోకి హార్దిక్ పాండ్యా.. 07:07 టైమ్‌పై సోషల్ మీడియాలో చర్చ..
-
Redmi 15 5G, Note 15 5G: భారీగా పెరిగిన రెడ్మీ 5G ఫోన్ల ధరలు!.. కొత్త ధరలు ఇవే
-
Tollywood : మెగాస్టార్ చిరంజీవితో ముగిసిన ఎగ్జిబిటర్ల సమావేశం.. గిల్డ్ నిర్మాతల ప్రతినిధులకు పిలుపు
-
CM Revanth Reddy: డిమార్ట్, బిగ్ బాజార్ల కంటే మిన్నగా ‘మహిళా శక్తి’.. 2034 నాటికి కోటి మంది కోటీశ్వరులు
ట్రెండింగ్
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?