Hardik Pandya: MI వీడి చెన్నై సూపర్ కింగ్స్‌లోకి హార్దిక్ పాండ్యా.. 07:07 టైమ్‌పై సోషల్ మీడియాలో చర్చ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్, ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా సోషల్ మీడియాలో చేసిన ఒక ఆసక్తికరమైన పోస్ట్ ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో పెను సంచలనంగా మారింది. ఐపీఎల్ 2026 సీజన్లో ముంబయి ఇండియన్స్ జట్టు ఘోర వైఫల్యాన్ని చవిచూసింది. లీగ్ స్టేజ్ ముగిసేసరికి ఆడిన 14 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగింటిలో మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. కెప్టెన్‌గా.. ఆటగాడిగా హార్దిక్ పాండ్యా తీవ్రంగా నిరాశపరిచారు. ఈ నేపథ్యంలో ముంబయి యాజమాన్యం ఆయనపై వేటు వేయనుందనే ప్రచారం జరుగుతుండగా.. హార్దిక్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఒక ‘క్రిప్టిక్’ పోస్ట్ ఈ ఊహాగానాలకు మరింత బలమిచ్చింది.
ఆ ’07:07′ సమయం వెనుక మర్మమేంటి?
హార్దిక్ పాండ్యా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక ఫోటోను పంచుకున్నారు. అందులో ఆయన లాప్టాప్ చూస్తూ ఉండగా, పక్కనే ఉన్న మొబైల్ స్క్రీన్ వెలుగుతూ కనిపించింది. అయితే, ఆ మొబైల్ లాక్ స్క్రీన్‌పై సమయం కచ్చితంగా “07:07” అని చూపిస్తోంది. దీనిని గమనించిన నెటిజన్లు, క్రికెట్ విశ్లేషకులు దీని వెనుక పెద్ద వ్యూహమే ఉందని భావిస్తున్నారు. క్రికెట్లో ‘7’ నంబర్ అనగానే అందరికీ గుర్తొచ్చేది చెన్నై సూపర్ కింగ్స్ (CSK) దిగ్గజం ఎంఎస్ ధోనీ. దీంతో హార్దిక్ పాండ్యా వచ్చే సీజన్లో ముంబయి ఇండియన్స్‌ను వీడి, చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో చేరబోతున్నారనే సరికొత్త చర్చకు సామాజిక మాధ్యమాల్లో తెరలేచింది.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
మరో ఆసక్తికర కోణం: రెండో పెళ్లా?
ఈ పోస్ట్‌పై కేవలం ఐపీఎల్ మార్పుల గురించే కాకుండా, హార్దిక్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన మరో ప్రచారం కూడా సాగుతోంది. ఆ ఫోటోలో ఉన్న నోట్‌బుక్, పెన్ పింక్ కలర్లో ఉండటం, అలాగే ‘07:07’ సమయం ఉండటాన్ని బట్టి ఆయన రాబోయే జూలై 7వ తేదీన (7వ నెల, 7వ తేదీ) ప్రముఖ మోడల్ మహీకా శర్మను రెండో వివాహం చేసుకోబోతున్నారనే వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి.
ముంబయి కోచ్ కీరన్ పొలార్డ్ సైతం హార్దిక్ భవిష్యత్తుపై స్పష్టమైన ప్రకటన చేయకపోవడంతో, ఈ ’07:07′ పోస్ట్ వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటో తెలియక అభిమానులు తలలు పట్టుకుంటున్నారు.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!