వాట్సాప్ వినియోగదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్‌ను అప్డేట్ చేస్తున్నట్టు ప్రకటించింది. వాట్సాప్ ప్రొఫైల్ లో ఫేస్‌బుక్ తరహాలో కవర్ ఫొటోను పెట్టుకునే విధంగా ఫీచర్‌ను డివలప్ చేస్తున్నట్టు వాట్సాప్ ప్రకటించింది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను బిజినెస్ వాట్సాప్ కోసం అభివృద్ది చేస్తున్నట్లు పేర్కన్నారు. వాట్సాప్‌లో బిజినెస్ వినియోగదారుల కోసం ప్రొఫైల్ సెట్టింగ్‌లో కెమెరా ఆప్షన్‌ను ఇవ్వనున్నట్లు తెలియజేపింది. కరవ్ పేజీకి కెమెరా ద్వారా ఫొటోను లేదా కొత్తదాన్ని కవర్‌ఫొటోగా ఎంపికచేసుకోవచ్చు. ప్రొఫైల్ ఫొటోను చూసే యూజర్లకు ప్రొఫైల్ ఫొటోతో పాటు, కవర్‌పేజీని కూడా వీక్షించే అవకాశం ఉంటుంది. అంతేకాదు, త్వరలోనే కమ్యూనిటి ఫీచర్‌ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు వాట్సాప్ ప్రయత్నాలు చేస్తున్నది. కమ్యూనిటీ ఫీచర్ ద్వారా గరిష్టంగా 10 గ్రూపులను లింక్ చేసకునే అవకాశం ఉంటుంది.