తెలుగు స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. బన్నీకి సంబంధించి ఏ వార్త బయటకు వచ్చినా ఫ్యాన్స్‌కి పండగే. తమ అభిమానాన్ని చాటుకునేందుకు రకరకాలుగా ప్రయత్నం చేస్తుంటారు.. ఇప్పటికే ఎంతో మంది బన్నీకి అదిరిపోయే గిఫ్ట్స్ ను ఇచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు.. తాజాగా మరో అభిమాని అద్భుతాన్ని సృష్టించారు.. అందుకు సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ అంటే ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలనుకునే అభిమానులు ఉంటారు. ఆ స్టార్ పాటలకు తాము కూడా స్పెప్పులు వేస్తుంటారు. వారి స్టైల్‌ని అనుకరిస్తుంటారు. అనుసరిస్తుంటారు. వారిలాగే రెడీ అవుతుంటారు. ఇంట్లో.. బైక్ మీద.. కారులో అన్నిచోట్ల ఆ హీరో ఫోటోలు పెట్టుకుని తిరిగేవారు ఉంటారు. అలా అల్లు అర్జున్‌కి వీరాభిమానులు చాలామంది ఉన్నారు. తమ అభిమానం చాటుకునేందుకు, వారి దృష్టిలో పడేందుకు ఏదో ఒకటి చేస్తుంటారు..
అందరు పేపర్ మీద బొమ్మలు వేస్తె ఓ ఆర్టిస్ట్ మాత్రం కొత్తగా ఆలోచించాడు.. ఏకంగా నీటిపై అల్లు అర్జున్ బొమ్మ వేసి అందర్నీ ఆకట్టుకున్నాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తే వావ్ అనాల్సిందే.. ఇక బన్నీ చూస్తే ఫ్యాన్ అయిపోతాడేమో..పళ్లెంలో ఉన్న నీటిపై రంగులతో ఓ ఆర్టిస్ట్ అల్లు అర్జున్ బొమ్మను వేయడం కనిపించింది. బొమ్మ మొత్తం పూర్తయ్యాక పుష్ప సినిమాలో మెడపై చేయి పెట్టి ‘తగ్గేదేలే’ అంటూ బన్నీ పెట్టిన ఫోజు కనిపించింది. ఇది చూసిన నెటిజన్లు ఆ బొమ్మ వేసిన ఆర్టిస్టు టాలెంట్‌ను తెగ మెచ్చుకుంటున్నారు… బన్నీ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం పుష్ప 2 చేస్తున్నాడు.. వచ్చే ఏడాది ఆగస్టు 15 న విడుదల కానుంది..