ప్రతిపక్షం కోరిక మేరకే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయన్నారు వైసీపీ నేత అంబటి రాంబాబు. ఇవాళ సభలో జరిగింది దురదృష్ట సంఘటన అనాలో…ప్రజలకు అదృష్టం అనాలో ప్రజలే నిర్ణయించాలి. శాసనసభకు మళ్లీ రాను అని శపథం చేసి వెళ్ళిపోయారు. ఆయన ఎందుకు వెళ్ళారో మాకు ఎవరికీ అర్థం కాలేదన్నారు అంబటి రాంబాబు. చంద్రబాబు ఏడ్చే ప్రయత్నం చేసినట్లు అనిపించింది. నేను కానీ, మా ఇతర సభ్యులు కానీ చంద్రబాబు భార్యను పల్లెత్తు మాట అనలేదు. మేము తప్పుగా మాట్లాడితే…