ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ని హత్య చేస్తామంటూ వచ్చిన ఓ బెదిరింపు కాల్ కలకలం రేపింది. దుండగుడు టోల్ ఫ్రీ నంబర్ 112కి కాల్ చేశారు. అంతేకారు యూపీ పోలీసుల సోషల్ మీడియా డెస్క్‌కు కూడా మెసేజ్ చేశాడు. త్వరలో సిఎం యోగిని చంపేస్తాను అంటూ సందేశం పంపాడు. దీంతో యూపీ యాంటీ టెర్రర్ స్క్వాడ్ (ఎటిఎస్) అప్రమత్తమైంది. ఫొన్ చేసిన వ్యక్తి రిహాన్గా గుర్తించారు. అతనిపై కేసు నమోదు చేశారు. 112 అనేది అత్యవసర పరిస్థితుల్లో పోలీసులకు కాల్ చేయడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన టోల్ ఫ్రీ నంబర్. సీఎం యోగిని చంపుతానంటూ బెదిరింపు రావడంతో పోలీసులు చర్యలు చేపట్టారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు.
Also Read:Extramarital Affair: ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను కడతేర్చిన భార్య
నిన్న యోగి ఆదిత్యనాథ్ అమ్రోహాలో బహిరంగ సభలను ఉద్దేశించి మాట్లాడుతూ మాఫియాను నిర్మూలించాలనే తమ మిషన్‌లో విజయం సాధించామని అన్నారు. డబుల్ ఇంజన్ శక్తితో అభివృద్ధి పనులు, శాంతిభద్రతలు ముందుకు తీసుకెళ్తే ఇది సాధ్యమైంది అని చెప్పారు. ఈ క్రమంలో సీఎం యోగికి బెదిరింపు ఫోన్ కాల్ రావడం గమనార్హం. ఇదిలా ఉంటే.. కేరళ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీని హత్య చేస్తామంటూ ఓ వ్యక్తి బెదిరించిన సంగతి తెలిసిందే. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్ కు లేఖ కూడా పంపాడు. దాంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.