ముఖ్య‌మంత్రి తీర్థ‌యాత్ర యోజ‌న‌: ఢిల్లీ నుంచి అయోధ్య‌కు ఫ్రీ ప్ర‌యాణం…

ఢిల్లీ ముఖ్య‌మంత్రి ప్ర‌క‌టించిన ఓ ప‌థ‌కం ఇప్పుడు వివాదాస్పందంగా మారింది.  60 ఏళ్లకు పైబ‌డిన ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకునేందుకు ఢిల్లీ ప్ర‌భుత్వం ముఖ్యమంత్రి తీర్థ‌యాత్ర యోజ‌న పేరుతో ఓ ప‌థ‌కాన్ని తీసుకొచ్చింది.  60 ఏళ్లు నిండిన వ్య‌క్తులు ఢిల్లీ నుంచి దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాలకు వెళ్లి వ‌చ్చేందుకు టికెట్ల‌ను ఫ్రీగా అందిస్తుంది.  దీనికోసం ఢిల్లీ స‌ర్కార్ ప్ర‌త్యేక రైళ్ల‌ను ఏర్పాటు చేసింది.  అయితే, క‌రోనా కార‌ణంగా ఇప్ప‌టి వ‌ర‌కు ఈ ప‌థ‌కం అమలు కాలేదు.  కాగా, డిసెంబ‌ర్ 3 వ తేదీ నుంచి ఈ ప‌థ‌కం ప్రారంభం కాబోతున్న‌ది.  డిసెంబ‌ర్ 3 వ‌తేదీన ఢిల్లీ నుంచి అయోధ్య‌కు మొద‌టి రైలు బ‌య‌లుదేర‌బోతున్న‌ది.  సుమారు 1000 మంది ప్ర‌యాణికుల‌తో ఈ రైలు అయోధ్య‌కు ప్ర‌యాణించ‌బోతున్న‌ట్లు అధికారులు చెబుతున్నారు.  

Read: అంబానీని బీట్ చేసిన అదానీ… ఆరేళ్ల త‌రువాత‌…

ఈ ప‌థ‌కం ద్వారా రైల్లో ప్ర‌యాణించేవారికి సంబంధించి మార్గ‌ద‌ర్శ‌కాలు, ప‌థ‌కానికి ఎలా ధ‌ర‌ఖాస్తు చేసుకోవాలి త‌దిత‌ర విష‌యాల‌ను ఇప్ప‌టికే ఢిల్లీ స‌ర్కార్ రిలీజ్ చేసింది.  60 ఏళ్లు నిండిన భార్య‌భ‌ర్త‌ల‌తో పాటుగా, వారికి తోడుగా 21 ఏళ్లు కంటే త‌క్కువ‌ వ‌య‌సున్న ఒక‌రిని తీసుకెళ్లేందుకు ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది.  ఢిల్లీ నుంచి దేశంలో ఎక్క‌డికెక్క‌డికి ప్ర‌త్యేక రైళ్ల‌ను ఏర్పాటు చేసింది… ఎన్ని రోజులు ప్ర‌యాణం చేసేందుకు అవ‌కాశం ఉంటుంది త‌దిత‌ర విష‌యాల‌ను ఇప్ప‌టికే స‌ర్కార్ రిలీజ్ చేసింది.

Read: మెగా ఆఫర్ పెట్టేసిన యాంకర్ రష్మీ.. ఏకంగా చిరు సరసనే..?

ఢిల్లీ-మ‌ధుర‌-బృందావ‌న్‌-ఆగ్రా-ఫ‌తేపూర్ సిక్రి-ఢిల్లీ – 5 రోజులు
ఢిల్లీ-హ‌రిద్వార్‌-రిషికేష్‌-నీల్‌కాంత్‌-ఢిల్లీ – 4 రోజులు
ఢిల్లీ-అజ్మీర్‌-పుష్క‌ర్‌-న‌థ్వారా-హల్థీఘాతి-ఉద‌య్‌పూర్‌-ఢిల్లీ – 6 రోజులు
ఢిల్లీ-అజ్మీర్‌-వాఘా బోర్డ‌ర్‌-ఆనంద్‌పూర్ షాహిబ్‌-ఢిల్లీ – 4 రోజులు
ఢిల్లీ-వైష్ణో దేవి- జ‌మ్మూ- ఢిల్లీ – 5 రోజులు
ఢ‌ల్లీ-రామేశ్వ‌రం-మ‌ధురై-ఢిల్లీ- 8 రోజులు
ఢల్లీ-తిరుప‌తి బాలాజీ- ఢిల్లీ – 7 రోజులు
ఢిల్లీ-ద్వార‌కాధీష్‌-నాగేశ్వ‌ర్‌-సోమ‌నాథ్‌-ఢిల్లీ – 6 రోజులు
ఢిల్లీ-పూరీజ‌గ‌న్నాథ్‌-కోణార్క్‌-భువ‌నేశ్వ‌ర్‌-ఢిల్లీ- 7 రోజులు
ఢిల్లీ-శిరిడీ-శ‌నిసింగ్లాపూర్‌-త్రియంబ‌కేశ్వ‌ర్‌-ఢిల్లీ-5 రోజులు
ఢిల్లీ-ఉజ్జ‌యినీ-ఓంకారేశ్వ‌ర్‌-ఢిల్లీ- 6 రోజులు
ఢిల్లీ-బోథ్‌గ‌య-సారానాథ్‌-ఢిల్లీ – 6 రోజులు
ఢిల్లీ-అయోధ్య‌-ఢిల్లీ- 4 రోజులు

Related Articles

Latest Articles