సినిమా టిక్కెట్ల వివాదానికి సంక్రాంతి లోపు తెర పడేనా.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకవైపు టికెట్ల వివాదం, మరో వైపు థియేటర్లలో తనిఖీలు, యజమానుల మూసివేతలు ఏపీలో వినోదరంగాన్ని కుదిపేస్తున్నాయి. సాధారణంగా సినిమా పరిశ్రమకు సంక్రాంతి ప్రధానమయింది. ప్రజలకు వినోదాన్ని అందించే సినిమాపై వివాదాలు నెలకొనడం.. క్రమంగా రాజకీయ రంగు పులుముకోవడం కలవరం కలిగిస్తోంది. ప్రభుత్వం తెచ్చిన నిబంధనలతో నష్టపోయేది ఎవరు? అనేది చర్చనీయాంశంగా మారింది. గతంలో సినిమాలంటే 50 రోజులు, 100 రోజులు, 200 రోజులు ఆడాలని భావించేవారు. కానీ ఇప్పుడు సినిమాలంటే మొదటి వారం రోజుల్లోనే పెట్టిన పెట్టుబడంతా వెనక్కి వచ్చేయాలన్న ఫార్ములా అమలుచేస్తున్నారు.
సినిమా హిట్ అయిందా ఫట్ అయిందా అని తెలిసేలోగానే పెట్టిన పెట్టుబడి రాబడుతున్నారు. అందులో భాగంగానే బెనిఫిట్ షోలు, అదనపు షోలు వేయడమే కాకుండా.. వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. కానీ ఏపీలో టికెట్ ధరలు తగ్గించడం, బెనిఫిట్ షోలపై ఆంక్షలు సినిమా రంగాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం నిబంధనలపేరుతో తనిఖీలు చేయిస్తోంది. లైసెన్స్ రెన్యువల్, ఫైర్ సేఫ్టీ, ఫుడ్ సేఫ్టీ, ఫారమ్-బి వంటి పత్రాల పేరుతో కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ప్రభుత్వం కొన్ని థియేటర్లను సీజ్ చేయగా.. మరికొందరు యజమానులు తమ వల్ల కాదంటూ స్వచ్ఛందంగా సినిమా హాళ్లను మూసివేశారు.
Also Read
- Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్‌గాంధీని ప్రశ్నించిన బీజేపీ
- Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
దీంతో ఏపీలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఇంత జరుగుతున్నా.. ప్రభుత్వం మాత్రం తన చర్యలను సమర్ధించుకుంటోంది. ప్రజలకు తక్కువ ధరకు వినోదాన్ని అందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని.. హీరోలు రెమ్యునరేషన్లు తగ్గించుకుంటే ఈ గోల ఉండదని పలువురు మంత్రులు చెబుతున్నారు. రూల్స్ అంటే అందరికీ ఒకటేనని అంటున్నారు. తాజా సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం కమిటీ నియమించింది.
కమిటీ సిఫార్సుల ఆధారంగానే ప్రభుత్వం ముందుకు వెళ్తుందని మంత్రి పేర్ని నాని చెబుతున్నారు. కమిటీ పేరుతో కాలయాపన జరిగితే పెద్ద సినిమాల విడుదలపై సందిగ్ధత ఏర్పడక మానదు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై సంక్రాంతి సీజన్ లో రిలీజ్ కాబోతున్న RRR, రాధేశ్యామ్ తో పాటు ఫిబ్రవరిలో విడుదల కానున్న ఆచార్య, భీమ్లా నాయక్ వంటి సినిమాల భవిష్యత్తు ఆధారపడి వుంది. సినిమా టికెట్ల వివాదం త్వరగా సమసిపోతుందని కొందరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!