ఒకవైపు టికెట్ల వివాదం, మరో వైపు థియేటర్లలో తనిఖీలు, యజమానుల మూసివేతలు ఏపీలో వినోదరంగాన్ని కుదిపేస్తున్నాయి. సాధారణంగా సినిమా పరిశ్రమకు సంక్రాంతి ప్రధానమయింది. ప్రజలకు వినోదాన్ని అందించే సినిమాపై వివాదాలు నెలకొనడం.. క్రమంగా రాజకీయ రంగు పులుముకోవడం కలవరం కలిగిస్తోంది. ప్రభుత్వం తెచ్చిన నిబంధనలతో నష్టపోయేది ఎవరు? అనేది చర్చనీయాంశంగా మారింది. గతంలో సినిమాలంటే 50 రోజులు, 100 రోజులు, 200 రోజులు ఆడాలని భావించేవారు. కానీ ఇప్పుడు సినిమాలంటే మొదటి వారం రోజుల్లోనే పెట్టిన పెట్టుబడంతా…