ఈ ఆధునిక యుగంలో మనిషి పరుగులు తీస్తున్నాడు. ఒకచోట నుంచి ఇంకొక చోటకు ప్రయాణం చేసేందుకు విమానాలు వినియోగిస్తున్నారు. గంటల వ్యవధిలోనే వేల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తున్నాడు. అయితే, విమానాల్లో ప్రయాణం చేసే వ్యక్తులు కొన్ని విషయాలను గురించి అసలు పట్టించుకోరు. అందరూ కిటికీ పక్కన సీటు దొరికితే బాగుండు అనుకుంటారు . కానీ, కిటికీ ఏ ఆకారంలో ఉంటుందో పెద్దగా పట్టించుకోరు. విమానంలో కిటికీలు అండాకారంలో ఉంటాయి. ఇలా ఎందుకు ఉన్నాయో ఎప్పుడైనా ఆలోచించారా. కిటికీలో ఇలా అండాకారంలో ఉండటానికి కారణం లేకపోలేదు. విమానాలు కనిపెట్టిన తరువాత వాణిజ్యపరంగా వినియోగంచే తొలినాళ్లలో కిటికీలు చతురుస్రాకారంలో ఉండేవి. విమానాలు తక్కువ ఎత్తులో వెళ్తుండేవి. అయితే, వినియోగం పెరిగిన తరువాత ఎక్కువ ఎత్తులో ప్రయాణాలు చేయాల్ని వచ్చింది. ఎక్కువ ఎత్తులో ప్రయాణం చేసే సమయంలో బయటి వాతావణంలో ఉండే ఒత్తిడి కిటికీలపై పడేది. దీంతో కిటికీలు పగుళ్లు ఏర్పడటం జరిగేది. దీని వలన రెండు మూడు విమానాలు కూలిపోయాయి కూడా. ఈ సమస్యను పరిష్కరించేందుకు డిజైనర్లు విమానాల కిటికీలను అండాకారంలోకి మార్చురు. దీంతో ఒత్తిడి అన్నివైపులా సమానంగా ఉండటంతో ఎలాంటి ప్రమాదాలు జరగలేదు. అప్పటి నుంచి విమానాల్లో కిటికీలను అండాకారంలోనే తయారు చేస్తున్నారు.
Read: స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌కు షాకిచ్చిన ఆఫ్రికా… ఆ వ్యాక్సిన్ వాడితే…