⦁ నేటి మధ్యాహ్నం 3.50 గంటలకు కోకాపేట వద్ద నియో పోలీస్ ట్రంపెట్ ఇంటర్ చేంజ్ ప్రారంభం.. సాయంత్రం 4 గంటలకు గండిపేట వద్ద గోదావరి ఫేజ్ 2&3 కి పునాది రాయి వేయనున్న సీఎం రేవంత్ రెడ్డి.. హైదరాబాద్ జల మండలి ఆధ్వర్యంలో నిర్మించిన 16 జలాశయాల ప్రారంభం.. నియో పోలీస్ వాటర్ సప్లై & సేవరేజ్ ప్రాజెక్ట్ కు భూమి పూజ.. గండిపేట గోల్కొండ రిసార్ట్స్ వద్ద బహిరంగ సభలో మాట్లాడనున్న సీఎం రేవంత్..
⦁ నేడు ఉదయం 11 గంటలకు ప్రజా భవన్ లో బ్యాంకర్లతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీటింగ్.. మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర ఆదాయం పెంపుపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ..
⦁ నేడు గాంధీ భవన్ లో పీసీసీ విస్తృత స్థాయి సమావేశం.. PCC చీఫ్ మహేష్ గౌడ్ అధ్యక్షతన మీటింగ్.. హాజరుకానున్న ఇంచార్జి మీనాక్షి నటరాజన్, DCC అధ్యక్షులు, పార్టీ ముఖ్య నాయకులు.. కామారెడ్డి సభపై ప్రధానంగా చర్చ..
⦁ నేడు బెంగుళూరు నుంచి తాడేపల్లికి మాజీ సీఎం వైఎస్ జగన్..
⦁ నేడు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కర్నూలు పర్యటన.. ఉల్లి మార్కెట్ ను సందర్శించి రైతులతో ముఖాముఖి.. ఉల్లి గిట్టుబాటు ధర కల్పించాలని ఆందోళన చేయనున్న షర్మిల..
⦁ నేడు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి రెగ్యూలర్ బెయిల్ పిటిషన్ పై ఏసీబీ కోర్టులో విచారణ..
⦁ నేడు ఏపీ లిక్కర్ స్కాం కేసులో ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్ పై హైకోర్టు విచారణ.. కేసులో ముగ్గురు నిందితులకు ఏసీబీ కోర్టు ఇచ్చిన బెయిల్ ను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేసిన సెట్..
⦁ నేడు రాయచోటి పట్టణం ఎన్జీవో హోంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో జరగనున్న స్త్రీ శక్తి విజయోత్సవ సభ..
⦁ నేడు గుంటూరులోని తురకపాలెం రానున్న ఢిల్లీ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ సైంటిస్టులు.. తురకపాలెంలో మట్టి నమూనాలు సేకరించనున్న ఐసీఏఆర్ శాస్త్రవేత్తలు..
⦁ నేటి నుంచి ఏపీ తెలంగాణలో భారీ వర్షాలు.. దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాలకు భారీ వర్ష సూచన..
⦁ నేడు మధ్యాహ్నం 2.30 గంటలకు పాత పార్లమెంట్ భవనంలోని సెంట్రల్ హాల్లో మాక్ ఓటింగ్.. పాల్గొననున్న ఇండియా కూటమి పక్షాల ఎంపీలు.. సాయంత్రం ఎన్డీయే కటూమి పక్షాల ఎంపీల మాక్ ఓటింగ్.. లోక్ సభ, రాజ్యసభ సభ్యులతో పాటు నామినేటెడ్ సభ్యులు కూడా ఓటర్లు.. మొత్తం సభ్యులు ఓటింగ్లో పాల్గొంటే.. 392 ఓట్లు వచ్చిన అభ్యర్థిదే గెలుపు..