* నేడు మాచర్లలో సీఎం చంద్రబాబు పర్యటన.. స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు..
* నేడు మూడో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. ఉదయం 10 గంటలకు ప్రారంభంకానున్న ఏపీ అసెంబ్లీ..
* నేడు రెండో రోజు సిట్ కస్టడీకి ఎంపీ మిథున్ రెడ్డి.. నేటితో ముగియనున్న ఎంపీ మిథున్ రెడ్డి సిట్ కస్టడీ..
* నేడు ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. కర్నూలు, కడప, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం..
* నేడు తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. 31 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు.. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం..
* నేడు యూసఫ్ గూడ ఇండోర్ స్టేడియంలో వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమం.. హాజరుకానున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. మధ్యాహ్నం 1 గంటకు టీఫైబర్ పై సమీక్ష.. మధ్యాహ్నం 2.30 గంటలకు సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ పై సమీక్ష..
* నేడు ఇరిగేషన్ శాఖపై మంత్రి ఉత్తమ్ సమీక్ష.. ఆల్మట్టి, తుమ్మిడిహట్టితో పాటు పెండింగ్ ప్రాజెక్టులపై సమీక్షించనున్న ఉత్తమ్..
* నేడు నిజామాబాద్ లో టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పర్యటన.. కాంగ్రెస్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొననున్న మహేష్ గౌడ్..
* నేటి నుంచి తెలంగాణలో యథావిధిగా ఆరోగ్యశ్రీ సేవలు.. ప్రభుత్వంతో నెట్ వర్క్ ఆస్పత్రుల చర్చలు సఫలం.. సమ్మె విరమించిన ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆస్పత్రులు..
* నేడు ముంబై, గుజరాత్ లో ప్రధాని మోడీ పర్యటన.. అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ ప్రారంభించనున్న మోడీ.. ముంబై నుంచి గుజరాత్ వెళ్లనున్న ప్రధాని.. భావ్ నగర్ లో రూ. 34,200 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం.. ధోలేరాలో ఏరియల్ సర్వే చేయనున్న ప్రధాని మోడీ..
* నేడు ఆసియా కప్ లో బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక.. దుబాయ్ వేదికగా రాత్రి 8గంటలకి మ్యాచ్..