* నేడు ఢిల్లీలోని జంతర్ మంతర్లో బీసీ ధర్నా.. పాల్గొననున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎంపీలతో పాటు రాహుల్, ప్రియాంక గాంధీలు..
* నేడు కొమురం భీం జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు పర్యటన.. జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ నిర్వహించే కార్యకర్తల సమావేశంలో పాల్గొననున్న రామచందర్ రావు..
* నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై చర్చ, ఆమోదం.. కొత్త రేషన్ కార్డుల జారీకి ఆమోదం తెలపనున్న కేబినెట్.. ఫ్రీహోల్డ్ భూముల్లో జరిగిన అక్రమాలపై సబ్ కమిటీ నివేదికపై చర్చ..
* నేడు మాజీ సీఎం జగన్ డోన్ పర్యటన.. మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కుమారుడి వివాహ రిషిప్షన్ కు హాజరుకానున్న జగన్..
* నేడు బాపట్లలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పర్యటన.. ఉదయం టౌన్ హాల్ నుంచి జరిగే శోభాయాత్ర, కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొనున్న మాధవ్..
* నేడు జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నిక.. 10 స్థానాలకు వైసీపీ, 9 టీడీపీ, ఒక స్థానం కోసం బీజేపీ పోటీ.. సీట్ల కేటాయింపులో జనసేన అసంతృప్తి.. ఎన్నికలకు దూరంగా సీపీఎం..
* నేడు లిక్కర్ స్కాం కేసులో రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి బెయిల్ పిటిషన్ పై ఏసీబీ కోర్టు విచారణ..
* నేటి నుంచి రెండు రోజులు పాటు రాజమండ్రిలో సీపీఐ జిల్లా మహాసభలు.. రాజమండ్రి సోమలమ్మ ఆలయం వద్ద ఉన్న జుట్టు కూలీ సంఘం కార్యాలయం మీదుగా సుబ్రహ్మణ్య మైదానం వరకు ప్రదర్శన.. అనంతరం సుబ్రహ్మణ్య మైదానంలో బహిరంగ సభ.. ముఖ్యఅతిథిగా హాజరుకానున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ..
* నేడు మూడో రోజు కొనసాగుతున్న సినీ కార్మికుల ఆందోళన.. ఇవాళ ఉదయం 11 గంటలకు ఛాంబర్ లో మరోసారి నిర్మాతల భేటీ.. లేబర్ కమిషనర్ ను కలవనున్న ఫిల్మ్ ఫెడరేషన్ నేతలు..