Double Murder: అనంతపురంలో జంట హత్యల కలకలం.. తల్లి, కొడుకు దారుణ హత్య
- అనంతపురం జిల్లాలో జంట హత్యల కలకలం..
- శింగనమల మండలం తరిమెలలో లో తల్లి, కొడుకు దారుణ హత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Double Murder: అనంతపురం జిల్లాలో జంట హత్యలు కలకలం సృష్టించాయి.. జిల్లాలోని శింగనమల మండలం తరిమెల గ్రామం ఎస్సీ కాలనీలో మంగళవారం తల్లి, కొడుకు దారుణ హత్యకు గురయ్యారు. గ్రామానికి చెందిన ఎల్లమ్మ (38) అనే అంగన్వాడీ టీచర్, ఆమె కుమారుడు చిన్న (22)ను హత్య చేశారు. ఈ ఘటన వెనుక కుటుంబ ఆస్తి వివాదమే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. గ్రామానికి చెందిన నల్లప్ప అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉన్నారు. నల్లప్ప మృతి అనంతరం రెండు కుటుంబాల మధ్య ఆస్తి విషయంలో తీవ్ర వివాదం నెలకొంది. ఈ క్రమంలో మొదటి భార్యకు చెందిన కుమారులు, రెండో భార్య ఎల్లమ్మతో పాటు ఆమె కుమారుడు చిన్నను హత్య చేసినట్లు సమాచారం. ఇక, ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఘటన స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
Read Also: Vizag Fleet Review 2026: విశాఖ తీరంలో నౌకాదళ విన్యాసాలు.. ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రత్యేక ఆకర్షణ.!
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
తాజావార్తలు
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
-
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!