‘బిగ్ బాస్ ఓటిటి’ తెలుగుకు ముహూర్తం ఫిక్స్

‘బిగ్ బాస్ తెలుగు’ మూడు సీజన్లకు హోస్ట్ గా వ్యవహరించిన తెలుగు సూపర్ స్టార్ నాగార్జున ఇటీవలే రియాల్టీ షో ఐదో సీజన్ ను ముగించారు. ఇప్పుడు ‘బిగ్ బాస్’ మేకర్స్ షో ఓటిటి ఫార్మాట్‌ను ప్రకటించారు. అప్పటి నుంచి ఈ ఓటిటి వెర్షన్ పై పలు రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. దీనికి సంబంధించిన మొదటి సీజన్‌ ను కూడా నాగార్జున హోస్ట్ చేయనున్నారు. ఇక షోను ప్రారంభానికి మేకర్స్ మూహూర్తాన్ని కూడా ఫిక్స్ చేశారట. ‘బిగ్ బాస్ తెలుగు ఓటిటి 1’ ఫిబ్రవరి 20న ప్రారంభం కానుందని తాజాగా ప్రచారం జరుగుతోంది. దాదాపు 18 మంది కంటెస్టెంట్లు ఈ రియాలిటీ షోలో కంటెస్టెంట్లుగా పాల్గొనబోతున్నారు.

Read Also : డైరెక్టర్ కి బాలయ్య వార్నింగ్… 6 నెలలు ఆ హీరోను కలవొద్దు !

‘బిగ్ బాస్ తెలుగు ఓటిటి 1’ కోసం 24 గంటల లైవ్ ఫీడ్ ని డిస్నీ హాట్‌స్టార్‌లో ప్రసారం చేయబోతోంది. రాబోయే ‘బిగ్ బాస్ తెలుగు ఓటిటి 1’ కోసం మేకర్స్ ‘బిగ్ బాస్ తెలుగు 5’ సెట్‌ను రీమోడలింగ్ చేసే పనిలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. మరోవైపు ‘బిగ్ బాస్ తెలుగు ఓటిటి 1’ మేకర్స్ రియాలిటీ షో కోసం కాస్టింగ్ చేపట్టారట. ‘బిగ్ బాస్ తెలుగు 5’ టైటిల్‌ను వీజే సన్నీ గెలుచుకోగా, షణ్ముఖ్ జస్వంత్ రన్నరప్‌గా నిలిచాడు. రియాలిటీ షో చుట్టూ పెరిగిన క్రేజ్‌తో రాబోయే సీజన్‌లను మరింత ఆసక్తికరంగా మార్చడానికి మేకర్స్ వినూత్నమైన గేమ్‌లు, ప్రచారాలను ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

Related Articles

Latest Articles