అక్క‌డ రెండు త‌ల‌ల వింత దూడ జ‌న‌నం… వారం రోజుల త‌రువాత‌…

మ‌న చుట్టూ ఉన్న ప్ర‌పంచంలో ఎన్నో వింత‌లు జ‌రుగుతుంటాయి.  కొన్ని వింత‌లు చాలా విచిత్రంగా ఉంటాయి.  అలాంటి వింత‌ల్లో ఇది కూడా ఒక‌టి.  ర‌ష్యాలోని ఖ‌ర్కాసియా ప‌రిధిలో మెట్కెచిక్ అనే గ్రామం ఉంది.  ఆ గ్రామంలో ఓ ఆవుకు వింత దూడ జ‌న్మించింది.  రెండు త‌ల‌ల‌తో దూడ జ‌న్మించింది.  జన్యులోపం కార‌ణంగా ఇలా రెండు త‌ల‌ల‌తో జ‌న్మించిన‌ట్టు అధికారులు చెబుతున్నారు.  ఆ వింత దూడ త‌ల‌భాగం ఆవుమాదిరిగా ఉన్న‌ప్ప‌టికీ, మిగ‌తా శ‌రీర భాగం పంది ఆకారంలో ఉన్న‌ది.  కాళ్లు కూడా పంది కాళ్లు మాదిరిగా ఉన్నాయి.  ఈ వింత‌దూడ జ‌న్మించిన గంట‌ల వ్య‌వ‌ధిలోనే మృతి చెందింది.  అయితే, ఈ వింత దూడ జ‌న్మించే ముందు ఏడు గంట‌ల‌పాటు తల్లిఆవు న‌ర‌క‌యాత‌న అనుభ‌వించింది.  దూడ జ‌న్మించి మ‌ర‌ణించిన వారం రోజుల తరువాత త‌ల్లిఆవు కూడా మృతి చెందింది.  జ‌న్యులోపం కార‌ణంగా జ‌న్మించిన వింత దూడ పుట్టిన త‌రువాత ఆ త‌ల్లిఆవుకు ఇన్ఫెక్ష‌న్ సోకి ఉంటుంద‌ని, కృతిమ ప‌ద్ధ‌తుల్లో గ‌ర్భ‌ధార‌ణనే చేప‌డుతున్నారని, ఫ‌లితంగా ఇలాంటి సంఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నాయ‌ని వెట‌ర్న‌రీ అధికారులు చెబుతున్నారు.  

Read: 40 ఏళ్ల క్రితం మాయ‌మైన 20 ఏళ్ల అమ్మాయి… ఇప్ప‌టికీ మిస్ట‌రీగానే…

Related Articles

Latest Articles