ప్రపంచంలో అనేక దేశాల్లో అగ్నిపర్వతాలు ఉన్నాయి. అయితే, కొన్ని ఇనాక్టీవ్‌గా ఉంటే, కొన్ని మాత్రం యాక్టీవ్ గా ఉంటాయి. ఎప్పుడు అవి బద్దలు అవుతాయో తెలియదు. నిత్యం పొగలు, బూడిదను వెదజల్లుతూ ఉంటాయి. స్పెయిన్ దేశంలో అగ్నిపర్వతాలు అధిక సంఖ్యలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ దేశంలోని కేనరీ ఐలాండ్‌లో గత నెల రోజులుగా అగ్నిపర్వతం లావాను విడుదల చేస్తున్నది. ఈ లావా ప్రవాహం ఇప్పుడు సమీపంలోని పట్టణంలోకి ప్రవేశించింది. పట్టణంలోకి లావా ప్రవేశంచడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. సమీపంలోని ఇళ్లను ఖాళీ చేయించారు. ప్రజలు ఎవరూ కూడా ఇళ్లనుంచి బయటకు రావొద్దని హెచ్చరించారు. గతంలో ఇలానే లావా ప్రవాహం అట్లాంటిక్ మహాసముద్రంలో కలియడంతో విషవాయువులు వ్యాపించాయి. ఈ విషవాయువుల కారణంగా అనేకమంది రుగ్మతలకు గురైన సంగతి తెలిసిందే.