పట్టణాభివృద్ధి విభాగంలో స్వచ్ఛ సర్వేక్షణ్-2021 ర్యాంకులను శనివారం నాడు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రకటించారు. ఈ ర్యాంకుల్లో తెలుగు రాష్ట్రాలు సత్తా చాటాయి. దేశంలో స్వచ్ఛ నగరంగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు మొదటి ర్యాంక్ దక్కింది. ఈ జాబితాలో గుజరాత్‌లోని సూరత్ రెండో ర్యాంకును, ఏపీలోని విజయవాడ 3వ ర్యాంకును దక్కించుకున్నాయి. ఏపీ నుంచి రెండు పట్టణాలు టాప్-10 జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ఏపీలోని విశాఖపట్నం 9వ స్థానంలో నిలిచింది. టాప్-10 ర్యాంకులను పరిశీలిస్తే ఇండోర్, సూరత్, విజయవాడ, నవీ ముంబై, పుణె, రాయ్‌పూర్, భోపాల్, వడోదర, విశాఖపట్నం, అహ్మదాబాద్ నగరాలు ఉన్నాయి.
కాగా స్వచ్ఛ్ సర్వేక్షణ్‌లో దేశంలోని దాదాపు 4320 నగరాలు, పట్టణాలు పాల్గొన్నాయి. తెలంగాణ నుంచి హైదరాబాద్ నగరం 13వ స్థానంలో నిలిచింది. మరోవైపు క్లీనెస్ట్ సిటీ అవార్డులను కూడా కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ వెల్లడించింది. క్లీనెస్ట్ గంగా టౌన్‌గా వారణాసికి అవార్డు దక్కింది. అతి పరిశుభ్రమైన రాష్ట్రంగా ఛత్తీస్‌గఢ్ నిలిచింది. విజేతలందరికీ రామ్‌నాథ్ కోవింద్ ఇవాళ పురస్కారాలను అందజేశారు.
Read Also: బ్రేకింగ్: పవన్ కళ్యాణ్ దర్శకుడికి కరోనా
అలాగే 50 వేల నుంచి లక్ష లోపు జనాభా ఉన్న ప్రాంతాలలో దక్షిణాదిలో తొలి స్థానం తెలంగాణలోని సిరిసిల్ల దక్కించుకుంది. అలాగే రెండో స్థానంలో సిద్ధిపేట పట్టణం ఉంది. అలాగే 5వ ర్యాంకులో ఏపీలోని ప్రకాశం జిల్లా కందుకూరు, 8వ ర్యాంకులో పులివెందుల, 10వ ర్యాంకులో పలమనేరు, 12వ ర్యాంకులో సత్తెనపల్లి, 13లో తాడేపల్లి, 14లో బొబ్బిలి, 15లో మండపేట, 16లో వికారాబాద్, 17లో కావలి, 19లో పుత్తూరు, 20వ ర్యాంకులో బెల్లంపల్లి పట్టణాలు ఉన్నాయి.