బ్రేకింగ్: పవన్ కళ్యాణ్ దర్శకుడికి కరోనా..

కరోనా మహమ్మారి కొద్దిగా నిదానించడంతో అందరు ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ సమయంలో పలువురు సెలబ్రిటీలు కరోనా బారిన పడడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తుంది. ఇటీవల హీరోయిన్ ప్రగ్య జైస్వాల్ కరోనా బారిన పది కోలుకున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి కరోనా బారిన పడ్డారు.

ప్రస్తుతం సురేందర్ రెడ్డి ఏజెంట్ సినిమా షూటింగ్ కోసం యూరప్ వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ కరోనా ప్రభావం ఎక్కువ ఉండడంతో ఆయన కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. దీంతో చిత్ర బృందం షూటింగ్ కి గ్యాప్ ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం సురేందర్ సెల్ఫ్ క్వారెంటైన్ లో ఉన్నారని, ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు చిత్ర యూనిట్ తెలుపుతోంది. ఇకపోతే అఖిల్ ‘ఏజెంట్’ తరువాత సురేందర్ రెడ్డి పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా తెరకెక్కనుంది.

Related Articles

Latest Articles