పట్టణాభివృద్ధి విభాగంలో స్వచ్ఛ సర్వేక్షణ్-2021 ర్యాంకులను శనివారం నాడు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రకటించారు. ఈ ర్యాంకుల్లో తెలుగు రాష్ట్రాలు సత్తా చాటాయి. దేశంలో స్వచ్ఛ నగరంగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు మొదటి ర్యాంక్ దక్కింది. ఈ జాబితాలో గుజరాత్‌లోని సూరత్ రెండో ర్యాంకును, ఏపీలోని విజయవాడ 3వ ర్యాంకును దక్కించుకున్నాయి. ఏపీ నుంచి రెండు పట్టణాలు టాప్-10 జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ఏపీలోని విశాఖపట్నం 9వ స్థానంలో నిలిచింది. టాప్-10 ర్యాంకులను పరిశీలిస్తే ఇండోర్, సూరత్, విజయవాడ,…