Site icon NTV Telugu

Vijaya Sai Reddy: అధికార దాహంతోనే పొత్తు.. టీడీపీపై కీలక వ్యాఖ్యలు

Vijaya Sai

Vijaya Sai

నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో నెల్లూరు లోక్ సభ వైసీపీ అభ్యర్థి విజయ సాయి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. ఆత్మకూరు నియోజకవర్గం అభివృద్ధికి విక్రమ్ రెడ్డి రూపొందించిన మానిఫెస్టోను విజయ సాయి రెడ్డి విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ.. టీడీపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేవలం అధికార దాహంతోనే ఇప్పుడు మళ్లీ టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుందని ఆరోపించారు. త్రిబుల్ తలాక్, సీఏఏ (CAA) బిల్లులకు వైసీపీ సపోర్ట్ చేయలేదని తెలిపారు. కేవలం దురుద్దేశంతో వైసీపీపై చంద్రబాబు బురద చల్లుతున్నారని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.

Read Also: PM Modi: 10 ఏళ్లు అధికారంలో లేకుంటే, దేశం తగలబడుతుందని అంటున్నారు..

టీడీపీకి ఇవే చివరి ఎన్నికలని విజయసాయి రెడ్డి విమర్శించారు. ఏ పార్టీ అయితే బీజేపీతో జతకడుతుందో ఆ పార్టీ తిరిగి ఉండదని వ్యాఖ్యానించారు. ఇక.. తాను జీవితాంతం వైఎస్సార్ ఫ్యామిలీతోనే ఉంటానని చెప్పారు. చంద్రబాబు తన కోసం, తన సామాజిక వర్గం కోసం మాత్రమే సంపద సృషించాడని ఆరోపించారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు చంద్రబాబు ఏమీ చేయలేదని పేర్కొన్నారు. వైఎస్ఆర్ కుటుంబం కోసం తాను జైలుకు పోయిన మాట వాస్తవం అని చెప్పారు.

Read Also: Amit Shah: ప్రధాని మోడీ, రాహుల్ గాంధీల మధ్య పోలికే లేదు..

చంద్రబాబు 5 కేసుల్లో A1 నిందితుడు అని విజయసాయి దుయ్యబట్టారు. ప్రజల సొమ్ము దోచుకొని జైలుకు వెళ్లిన చంద్రబాబు తనను విమర్శించడం సిగ్గుచేటు అని అన్నారు. చంద్రబాబు మైండ్ అంతా నెగిటివ్ ఆలోచనలతో నిండిపోయి ఉంటుందని తెలిపారు. పార్టీకి కార్యకర్తలు నాలుగు స్తంభాల లాంటి వారని అన్నారు. కొన్ని సందర్భాల్లో అందరికీ న్యాయం చేయలేక పోవచ్చు.. వినూత్నమైన ఆలోచనలతో పరిపాలించిన జగన్ ను మళ్లీ అధికారంలోకి తెచ్చుకుందాం అని తెలిపారు. ఆత్మకూరు ప్రాంత అభివృద్ధికి అహర్నిశలూ కృషి చేస్తానని.. కచ్చితంగా ఒక భారీ పరిశ్రమను ఈ ప్రాంతానికి తీసుకొస్తానని విజయసాయి రెడ్డి చెప్పారు.

Exit mobile version