హైదరాబాద్‌లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి మనవరాలి వివాహం అంగరంగ వైభవంగా, కన్నుల పండుగగా జరిగింది. శంషాబాద్ విమానాశ్రమంలోని జీఎంఆర్ ఎరినా ఈ వివాహనికి వేదిక అయింది. హైదరాబాద్‌కు చెందిన రవితేజతో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి మనవరాలు నిహారిక వివాహం జరిగింది. ఈ వివాహానికి రాజకీయ, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు.
Read: సాయితేజ కుంటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలి: చంద్రబాబు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు, హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగార్జున తదితరులు హాజరయ్యారు. ఎన్టీవీ అధినేత నరేంద్ర చౌదరి కుటుంబసభ్యులు ఈ వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వెంకయ్యనాయుడికి ఎన్టీవీకి ఎప్పటినుంచో మంచి అనుబంధం ఉన్నది. ఎన్టీవీ నిర్వహించే ఎన్నో కార్యక్రమాల్లో వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. భక్తి టీవీ నిర్వహించే కోటిదీపోత్సవం కార్యక్రమంలో కూడా గతంలో వెంకయ్యనాయుడు పాల్గొన్న సంగతి తెలిసిందే.