జూనియర్ ఎన్టీఆర్ 38వ పుట్టినరోజు ఈ రోజు (మే 20). అయితే ఇటీవలే ఎన్టీఆర్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ప్రస్తుతం సెల్ఫ్ క్వారంటైన్ లో ఒంటరిగా ఉన్నాడు. కోవిడ్ -19 మహమ్మారి సందర్భంగా తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవద్దని జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానులను కోరిన విషయం తెలిసిందే. అయితే తారక్ కు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శక ధీరుడు రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ నుంచి పోస్టర్ ను విడుదల చేస్తూ ఎన్టీఆర్ కు బర్త్ డే విషెస్ తెలిపారు. తాజాగా విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఎన్టీఆర్ కు బర్త్ డే విషెస్ చెప్తూ ట్వీట్లు చేశారు. “పుట్టినరోజు శుభాకాంక్షలు తారక్… మీరు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. టేక్ కేర్ బ్రదర్” అంటూ మహేష్ ట్వీట్ చేయగా… “జన్మదిన శుభాకాంక్షలు డియర్ తారక్… ఇది నీకు ఆనందం, ఆరోగ్యం నిండిన సంవత్సరం కావాలి” అంటూ వెంకీ ట్వీట్ చేశారు.