AP Three Capitals: మూడు రాజధానులపై ఎలాంటి సందేహం అవసరం లేదు.. వైసీపీ విధానం మూడు రాజధానులే అన్నారు మంత్రి అంబటి రాంబాబు.. విజయవాడలో భూగర్భ జలవనరుల డేటా సెంటర్‌ను ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సమతౌల్యత కోసమే మూడు రాజధానులు.. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా అనే స్ధానిక భావాలున్నాయని.. వాటిని వదులుకోకూడదనే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు.. నీటి పరీక్షలకు ఇకపై విజయవాడలో పూర్తి ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.. Read Also:…
AP Three Capitals: ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల వ్యవహారంపై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.. మూడు రాజధానుల చట్టం చేసే అధికారం రాష్ట్ర శాసనసభకు లేదన్న హైకోర్టు.. అమరావతి ప్రాంతంలో రోడ్లు, మౌలిక సదుపాయాల కల్పనకు నిర్దిష్ట గడువు పెట్టింది.. ఆరు నెలలలోపు రాజధాని నిర్మాణం పూర్తి కావాలని పేర్కొంది.. అయితే, హైకోర్టు తీర్పును దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో చాలెంజ్ చేసింది వైఎస్ జగన్ సర్కార్.. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది.. అయితే, గత నవంబర్‌లో…
మూడు రాజధానులకు మద్దతుగా కర్నూలులో నాన్ పొలిటికల్ జేఏసీ రాయలసీమ గర్జన నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి అధికార పార్టీ వైసీపీ మద్దతు పలికింది. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ జేఏసీ ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.
Andhra Pradesh: ఏపీలో మూడు రాజధానుల రాజకీయం నడుస్తోంది. అభివృద్ధి వికేంద్రీకరణ చేసి తీరుతామని ప్రభుత్వం తెగేసి చెప్తోంది. ఈ నేపథ్యంలో మూడు రాజధానులకు మద్దతుగా ఈరోజు కర్నూలులో నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో రాయలసీమ గర్జన సభ జరగనుంది. వైసీపీ మద్దతుతో ఈ సభను నాన్ పొలిటికల్ జేఏసీ భారీ ఎత్తున నిర్వహించనుంది. కర్నూలు ఎస్టీబీసీ మైదానంలో ఉదయం 10 గంటలకు జరిగే ఈ బహిరంగ సభకు సుమారు లక్ష మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు.…
Andhra Pradesh: అభివృద్ధి వికేంద్రీకరణే ధ్యేయంగా మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా కర్నూలులో న్యాయరాజధాని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో మూడు రాజధానులకు మద్దతుగా ఈనెల 5న కర్నూలు వేదికగా రాయలసీమ గర్జన జరగనుంది. ఎస్టీబీసీ గ్రౌండ్స్‌లో రాయలసీమ గర్జనను భారీగా నిర్వహించాలని నాన్ పొలిటికల్ జేఏసీ భావిస్తోంది. ఈ కార్యక్రమానికి రాయలసీమకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. రాయలసీమ ప్రాంతంలో కర్నూలులో హైకోర్టు…
ఏపీలో 3 రాజధానుల అంశం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. జగన్ సర్కార్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది. దీంతో హైకోర్టు విచారణ చేపట్టింది. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు పలు అంశాలపై ప్రభుత్వంపై ప్రశ్నలు గుప్పించింది. అంతేకాకుండా నేటికి విచారణను వాయిదా వేసింది. దీంతో నేడు విచారణకు హజరైన అడ్వకేట్ జనరల్ 3 రాజధానుల బిల్లును ఉపసంహరించుకుంటున్నట్లు ఉన్నత న్యాయస్థానానికి వెల్లడించారు. ఈ విషయంపై అత్యవసరంగా నిర్వహించిన కేబినెట్ సమావేశంలో చర్చించి 3…
3 రాజధానుల అంశం ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. ఏపీలో మూడు రాజధానులు చేస్తామంటూ జగన్ సర్కార్ ప్రకటించడంతో పాటు అసెంబ్లీలో చట్టం చేసింది. ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలవడంతో హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరుపున హజరైన అడ్వకేట్ జనరల్ 3 రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకుంటునట్లు ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా ఏపీలో రాజకీయ పరిణామాల్లో మార్పు చోటు చేసుకుంది. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి..…
ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మూడు రాజధానుల అంశం నేడు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. మూడు రాజధానుల అంశాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు అవడంతో హైకోర్టు విచారణ చేపట్టింది. మూడు రాజధానుల అంశంపై వాదోపవాదాలు విన్న హైకోర్టు విచారణను నేటికి వాయిదా వేసింది. ఈ రోజు మళ్లీ హైకోర్టు ఈ విషయంపై విచారణ చేపట్టడంతో మూడు రాజధానులు అంశాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రభుత్వం తరుపున అడ్వకేట్ జనరల్ వెల్లడించారు. దీనిపై అసెంబ్లీలో కూడా…
అమరావతి రైతులు, ఏపీకి ఒకే రాజధానికి మద్దతిస్తున్న వారికి జగన్ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. మూడు రాజధానులపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల చట్టాన్ని ఉప సంహరించుకున్నట్లు అడ్వకేట్ జనరల్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకుంటామని హైకోర్టుకు అడ్వకేట్ జనరల్ వెల్లడించారు. Also Read : కొండపల్లి మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను కేబినెట్ రద్దు చేసినట్లు…
మూడు రాజధానులు ప్రజల ఆకాంక్ష.. మూడు రాజధానులు వచ్చి తీరతాయని స్పష్టం చేశారు ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రజల హృదయాల నుంచి ఉద్యమాలు పుడతాయి, కొంతమంది ప్రయోజనాల కోసం చేసే వాటిని డ్రామాలంటారు అని మండిపడ్డారు.. ప్రజల మనోభావాలను అర్థం చేసుకోకుండా చంద్రబాబు లాంటి సీనియర్ నేతలు వ్యవహరించటం ఆశ్చర్యం కలిగిస్తోందన్న ఆయన.. 600 రోజులు అయ్యాయని ఒక పండుగ వాతావరణం టీడీపీలో కనిపిస్తోంది.. రాష్ట్ర విభజన నాటి పరిస్థితులను…