కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నేత జేపీ నడ్డా.. రాజ్యసభ సభా నాయకుడిగా నియమితులయ్యారు. జేపీ నడ్డాను రాజ్యసభలో సభాపక్ష నేతగా చేయాలని బీజేపీ నిర్ణయించింది. ఇంతకుముందు.. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సభలో ఈ బాధ్యతను నిర్వహించేవారు.. అయితే అతను నార్త్ ముంబై లోక్‌సభ స్థానం నుండి ఎంపీగా ఎన్నికైన తరువాత, అతను రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో.. ఈ బాధ్యతను జేపీ నడ్డాకు అప్పగించారు. ఈ నెల ప్రారంభంలో..…
బీజేపీ రాజ్యసభ ఎంపీ జేపీ నడ్డా.. మోడీ 3.0 ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అలాగే కీలకమైన ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం మరియు రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖలను అప్పగించారు.