National Scholarships: తాజాగా 2024 – 25 సంవత్సరంకు గాను చుదువులు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు వివిధ స్కాలర్‌షిప్ లకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం తాజాగా కేంద్రం కొన్ని కొత్త రూల్స్ ను తీసుకొచ్చింది. ఇక వాటికీ సంబంధిత వివరాలను పరిశీలిస్తే.. జాతీయ స్కాలర్‌షిప్ పోర్టల్ లో ప్రతి విద్యార్థి వన్-టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) నంబర్ అనేది తప్పనిసరి. ఇది వారి మొత్తం విద్యకి చెల్లుబాటు అయ్యేలా చర్యలు చేపట్టింది. 2024 – 25 విద్యా సంవత్సరానికి నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ (NSP) సిద్ధం చేసారు అధికారులు. ఇందులో తాజాగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఎవరిపైన, ఏదైనా స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేయడానికి ముందు వారికీ అర్హత ఉందో లేదో ఈ పోర్టల్లో తెలుసుకోవచ్చు.
Mallikarjun Kharge: ప్రధాని మోడీ ‘ఎమర్జెన్సీ’ వ్యాఖ్యలపై ఖర్గే కౌంటర్..
ఇక ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేయడానికి వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) అనే ఓ ప్రత్యేక నంబర్ ను ఇస్తున్నారు. విద్యార్థులు e-KYC పూర్తి చేసి, వారి మొబైల్ నంబర్‌ను ఉపయోగించి నమోదు చేసుకోవాలి. దీని తర్వాత విద్యార్థుల ఫోన్‌కి OTR నంబర్ జనరేట్ అవుతుంది. దీని ద్వారా సులువుగా లాగిన్ అవ్వొచ్చు. ఈ OTR నంబర్ ఒక్కసారి మాత్రమే వస్తుంది. దాంతో ఆ విద్యార్థి చదివినన్ని రోజులు వాడుకోవచ్చు. ఇక దీని తర్వాత NSP OTR, విద్యార్థి అకడమిక్ కెరీర్ వ్యవధికి చెల్లుబాటు అయ్యే 14 అంకెల సంఖ్య అనేది ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఐడి కి అనుగుణంగా జారీ అవుతుంది. 2024 – 25 విద్యా సంవత్సరంలో నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్లో స్కాలర్ షిప్‌ల కోసం దరఖాస్తు చేసుకోవాలంటే.. OTR కచ్చితంగా కావలిసిందే. ఆధార్ ఎన్‌రోల్మెంట్ నంబర్ తో, OTRని మనం పొందవచ్చు.
Pawan Kalyan: పవన్ తో ముగిసిన నిర్మాతల సమావేశం.. టికెట్ రేట్లపై అల్లు అరవింద్ షాకింగ్ కామెంట్స్
ఇక నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్లో వివిధ స్కాలర్షిప్ ప్రోగ్రామ్‌ల కోసం దరఖాస్తు చేయడానికి OTR పూర్తి చేయడం తప్పనిసరి. NSP OTR యాప్ కి యాక్టివ్ సెల్ ఫోన్ నంబర్ కచ్చితంగా ఉండాలి. ఈ విషయంలో తల్లిదండ్రులు లేదా సంరక్షకులు గరిష్టంగా రెండు OTR లను మాత్రమే రూపొందించవచ్చు. ఇక్కడ ఒక్కో విద్యార్థికి కేవలం ఒక OTR మాత్రమే అనుమతిస్తారు. ఇక సదరు విద్యార్థి OTR అందుకున్న తర్వాత స్కాలర్షిప్ పథకాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకవేళ ఒకే విద్యార్థికి ఒకటి కంటే ఎక్కువ OTRలు ఉంటే మాతరం వారు స్కాలర్షిప్ కు అర్హులు కాదు. ఇక https://scholarships.gov.in ద్వారా మొబైల్ నంబర్ ఎంటర్ చేసి.. Get OTP బటన్ క్లిక్ చేస్తే.. మీ మొబైల్ కి ఓటిపి వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి, క్యాప్చా కోడ్ ఇచ్చి.. Next బటన్ పై క్లిక్ చెయ్యాలి. ఇప్పుడు మీ ఈమెయిల్ అడ్రెస్, ఆధార్ కార్డ్ సమాచారం ఇచ్చి ఆ తర్వాత చివరగా submit క్లిక్ చేస్తే.. మీ ఫోన్ కు రిఫరెన్స్ నంబర్ వస్తుంది. అంటే మీకు NSP OTR రిజిస్ట్రేషన్ పూర్తి అయినట్లు. ఆ తర్వాత NSP OTR యాప్ ఇన్స్టాల్ చేసుకొని అందులో ఫేస్ రికగ్నిషన్ కచ్చితంగా పూర్తి చేసుకోవాలి. దాంతో మీ మొబైల్‌కి NSP OTR వస్తుంది. దానిని వాడుకొని స్కాలర్‌షిప్ల కోసం సరైన విధానంలో అప్లై చేసుకోవచ్చు.