వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తప్పదని ఇప్పటికే స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం.. అయితే, విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు అంటూ సాధించుకున్న ఈ పరిశ్రమ ప్రైవేటీకరణకు ఒప్పుకునేది లేదంటున్నాయి అన్ని పార్టీలు.. విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం ఉద్యమాన్ని ఉధృతం చేశాయి… విశాఖ నుంచి ఇప్పుడు ఆందోళన ఢిల్లీ వరకు చేరింది… బీజేపీ మినహా అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు, కార్మిక సంఘాలు.. ఈ ఆందోళనలో పాలుపంచుకుంటున్నాయి.. అయితే, విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంపై మరోసారి తన వైఖరిని కుండబద్దులు కొట్టింది కేంద్ర ప్రభుత్వం.. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై పునరాలోచన లేదని స్పష్టం చేసింది.. ప్రైవేటీకరణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని లోక్‌సభలో వెల్లడించింది.. అయితే, ఉద్యోగులు, భాగస్వాముల సమస్యలు పరిష్కరిస్తామని అంటోంది కేంద్ర ఆర్థిక శాఖ.. ఎంపీల ప్రశ్నలకు లిఖితపూర్వక లోక్‌సభలో సమాధానం ఇచ్చిన కేంద్ర మంత్రి భగవత్ కిషన్ రావ్ కరాడ్… ప్రైవేటీకరణ తప్పదని.. అసలు పునరాలోచన లేదని తెలిపారు.