Shocking Murder : యూపీలో పట్టపగలే దారుణం.. యువతిని తుపాకీతో కాల్చి చంపిన దండగులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నేరాలకు కేరాఫ్ గా మారుతోంది. ఇటీవల కాలంలో హత్యలు జరుగుతున్నాయి. గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ సోదరులు, ఆయన కుమారుడి ఎన్ కౌంటర్ ఘటన మరువక ముందే మరో దారణం జరిగింది. జలాన్ జిల్లాలో ఈరోజు ఉదయం కళాశాల పరీక్షకు హాజరై తిరిగి వస్తున్న యువతిని మోటార్‌సైకిల్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు కాల్చి చంపారు.
Also Read:CM Jagan Lawyer : కోడి కత్తి కేసులో ఎన్ఐఏ కరెక్టుగా విచారణ జరుపలేదు..
బాధితురాలు రోష్ని అహిర్వార్ అనే 21 ఏళ్ల BA విద్యార్థిని ఉదయం 11 గంటల ప్రాంతంలో పరీక్ష ముగించుకుని రామ్ లఖన్ పటేల్ మహావిద్యాలయం నుండి ఇంటికి తిరిగి వస్తుండగా బజాజ్ పల్సర్ మోటార్‌సైకిల్‌పై ఇద్దరు వ్యక్తులు కంట్రీ మేడ్ పిస్టల్‌తో ఆమె వద్దకు వచ్చారు. వారిలో ఒకరు ఆమె తలపై కాల్చడంతో రోష్ని అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు ఆ వ్యక్తులను పట్టుకునేందుకు పరుగెత్తారు, అయితే వారు ఆయుధాన్ని విసిరి వేగంగా వెళ్లిపోయారు.
Also Read
- Trump-Netanyahu: ట్రంప్‌నకు నెతన్యాహు షాక్.. కీలక ప్రతిపాదన తిరస్కరణ!
- SpaceX Rocket: చంద్రుడిని ఢీకొట్టిన స్పేస్ఎక్స్ రాకెట్! శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..!
- Modi-Meta: మెటాకు కేంద్రం 3 రోజులు డెడ్‌లైన్.. క్షమాపణ చెప్పకుంటే..!
- Rahul Gandhi: రాహుల్‌గాంధీతో కిరణ్ రిజిజు భేటీ.. కీలక ప్రతిపాదనను తిరస్కరించిన ప్రతిపక్ష నేత
యువతి తల్లిదండ్రులు ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనుమానితును ప్రశ్నిస్తున్నారు. అందరూ చూస్తుండగా రక్తపు మడుగులో నేలపై పడి ఉన్న యువతి యొక్క వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. యువతి కళాశాల యూనిఫాంలో ఉంది. ఆమె పక్కన నేలపై పిస్టల్ కనిపిస్తుంది. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలు బీఏ సెకండ్ ఇయర్ విద్యార్థిని, కాలేజీ ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్నట్లు జలౌన్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డాక్టర్ ఇరాజ్ రాజా తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని, త్వరలో అరెస్టు చేస్తామని చెప్పారు. ఈ హత్యకు సంబంధించిన చాలా ఆధారాలు లభించాయని, దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.
Also Read:Atiq Ahmed’s Killers: మరో జైలుకు గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ హంతకులు
ప్రయాగ్‌రాజ్‌లో గ్యాంగ్‌స్టర్-రాజకీయ అతిక్ అహ్మద్‌ను ముగ్గురు వ్యక్తులు కాల్చి చంపిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటన జరిగిన రెండు రోజులకే తాజాగా మరో యువతిని తుపాకీతో కాల్చ చంపడంతో రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
తాజావార్తలు
-
Trump-Netanyahu: ట్రంప్‌నకు నెతన్యాహు షాక్.. కీలక ప్రతిపాదన తిరస్కరణ!
-
Suriya: 200 రోజులు కష్టపడ్డా ఫ్లాప్.. 45 రోజుల్లో తీస్తే ఇండస్ట్రీ హిట్! ఆ రెండు సినిమాలపై సూర్య షాకింగ్ కామెంట్స్..
-
School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
-
Jantar Mantar Protest: ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో బిగ్ ట్విస్ట్
-
AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అజెండాలో అమరావతి.. కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్..!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!