నేటి నుంచి బ్యాంకుల సమ్మె.. డిమాండ్స్ ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్యాంకు ఉద్యోగులు సమ్మె బాటపట్టారు.. ప్రభుత్వ రంగ బ్యాంకులు నేటి నుంచి రెండు రోజుల పాటు సమ్మెలో పాల్గొనబోతున్నాయి.. డిసెంబర్ 16, 17 తేదీల్లో దేశవ్యాప్తంగా ప్రధాన ప్రభుత్వ రంగ బ్యాంకుల ఈ సమ్మెలో పాల్గొని.. తమ డిమాండ్లను వినిపించబోతున్నాయి.. ఇంతకీ బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు వెళ్లాల్సిన కారణాలు ఏంటి? వారి డిమాండ్లు ఏంటి? అని ఓసారి పరిశీలిస్తే.. ప్రభుత్వ రంగం బ్యాంకుల్లో రెండింటిని.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రైవేటీకరించాలని ప్రభుత్వం బడ్జెట్ 2021-22లో కేంద్రం నిర్ణయించడం.. ఆ దిశగా ప్రక్రియను కూడా ప్రారంభించిన నేపథ్యంలో.. బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాయి సంఘాలు. దీనిపై ముందుగానే సమ్మె నోటీసు ఇచ్చాయి బ్యాంకు సంఘాలు.. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్ (యూఎఫ్‌బీయూ) సమ్మె నోటీసు ఇచ్చింది.. బ్యాంకులను ప్రైవేట్‌పరం చేస్తే బలహీన వర్గాలకు రుణాల లభ్యత తగ్గుతుందని.. కోట్లాది మంది డిపాజిట్లు రిస్క్‌లో పడతాయని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.. ఇక, అదనపు చీఫ్ కమిషనర్‌తో జరిపిన చర్చలు కూడా విఫలం కావడంతో.. సమ్మెకు దిగుతున్నారు.
Read Also: ‘ఊబెర్ ఈట్స్’ సరికొత్త రికార్డు.. అంతరిక్షంలో ఫుడ్ డెలివరీ..
Also Read
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్‌కు ట్రంప్ తాజా హెచ్చరిక
- Bill Gates: నేనెవరినీ వేధించలేదు.. ఎప్స్టీన్ కేసు విచారణలో బిల్‌గేట్స్ కీలక వ్యాఖ్యలు
- Iran-US: బెదిరింపులకు భయపడం.. ట్రంప్‌కు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ కౌంటర్
- PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
నేడు, రేపు జరగనున్న ఈ సమ్మెలో ప్రభుత్వ రంగంలోని బ్యాంకులకు చెందిన దాదాపు 10 లక్షల మంది ఉద్యోగులు, అధికారులు పాల్గొనబోతున్నారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యుఎఫ్‌బీయూ) ఈ సమ్మెకు నేతృత్వం వహిస్తోంది. బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లు – 2021ని ఉపసంహరించుకోవాలని యుఎఫ్‌బీయూ డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వ రంగ బ్యాంకులను బలోపేతం చేయాలని కోరుతోంది. ఈ దేశంలో సామాన్యులకు సేవలందించడానికి ప్రభుత్వ రంగ బ్యాంకులు వుండడం చాలా అవసరమని పేర్కొంది. 1969లో బ్యాంకులను జాతీయకరణ చేసిన తర్వాతనే పేదలు, అవసరంలో వున్నవారికి బ్యాంకుల సేవలు అందాయన్న విషయం గుర్తుంచుకోవాలని సూచిస్తోంది.. 1969లో 8 వేలుగా వున్న ప్రభుత్వ రంగ శాఖలు ప్రస్తుతం 1.18 లక్షలకు చేరాయంటేనే ఎంతగా అభివృద్ధి చెందాయో తెలుస్తోందని.. కానీ, ప్రభుత్వ రంగ బ్యాంకులు సమర్ధవంతంగా పనిచేయడం లేదని, నష్టాల్లో నడుస్తున్నాయని చిత్రీకరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడుతున్నారు. మరోవైపు.. బ్యాంకు ఉద్యోగుల, అధికారుల సమ్మెకు ఇతర సంఘాలు కూడా మద్దతు ప్రకటిస్తున్నాయి.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్‌లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్‌కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్‌లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!