సింహం అడవికి రారాజు. అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. అలాంటి సింహాన్ని బెదిరించాలి అంటే సింహం కంటే బలమైన జంతువు అయి ఉండాలి. అయితే, ఓ చిన్న తాబేలు అడవికి రాజైన సింహాన్ని బెదిరించింది. తన తలను పైకి ఎత్తి సింహంపైకి దూసుకెళ్లింది. దీంతో సింహం నాకెందుకులే అన్నట్టుగా పక్కకు జరిగి మళ్లీ నీళ్లు తాగడం మొదలుపెట్టింది. అయినప్పటికి ఆ తాబేలు ఊరుకోలేదు. సింహం మీదకు మళ్లీ తలను పైకి ఎత్తి అక్కడి నుంచి వెళ్లిపో అన్నట్టుగా హెచ్చరించింది. తాబేలు హెచ్చరికకు భయపడిన సింహం సగం నీటితోనే కడుపు నింపుకొని వెళ్లిపోయింది. దీనిని సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Read: తప్పుడు హెయిర్ కట్ ఫలితం: మోడల్‌కు రూ.2 కోట్ల పరిహారం…