TSRTC: రోడ్డెక్కుతున్న లహరి బస్సులు.. అదిరిపోయే ప్రత్యేకలు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) ప్రయాణికుల సౌకర్యార్థం హైటెక్ ఫీచర్లతో తొలిసారిగా ఏసీ స్లీపర్ బస్సులను ప్రారంభించనుంది. మొదటి దశలో 16 ఏసీ స్లీపర్ బస్సులను వినియోగంలోకి తెస్తున్నారు. ప్రైవేట్ బస్సులకు ధీటుగా రూపొందించిన ఈ బస్సులు సోమవారం నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి. తెలంగాణ ఆర్టీసీ ఈ 16 కొత్త ఏసీ స్లీపర్ బస్సులను కర్ణాటకలోని బెంగళూరు, హుబ్లీ, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, తిరుపతి, తమిళనాడులోని చెన్నై రూట్లలో నడపనుంది. ఈ కొత్త ఏసీ స్లీపర్ బస్సుల ప్రారంభోత్సవం సోమవారం ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్ ఎల్ బీ నగర్ లో విజయవాడ రూట్ లో జరగనుంది. తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరై కొత్త బస్సులను జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి టీఎస్‌ఆర్‌టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, టీఎస్‌ఆర్‌టీసీ ఎండీ వీసీ సజ్జనార్, ఐపీఎస్, ఇతర ఉన్నతాధికారులు హాజరవుతున్నారు.
Also Read: Boxing : భారత్ కు మరో రెండు స్వర్ణాలు.. నిఖత్, లవ్లీనా జోరు
ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించాలనే ఉద్దేశంతో టీఎస్ఆర్టీసీ ఇటీవలే కొత్త సూపర్ లగ్జరీ 630 బస్సులు, 8 నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సులు, 4 నాన్ ఏసీ స్లీపర్ బస్సులను ప్రారంభించింది. ఈ బస్సులకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని అధికారులు తెలిపారు. ఈ నేపధ్యంలో సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం అత్యాధునిక సౌకర్యాలతో కొత్త ఏసీ స్లీపర్ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని TSRTC యాజమాన్యం నిర్ణయించింది. ఈ క్రమంలో నాన్-ఏసీ స్లీపర్ బస్సుల మాదిరిగానే, ఏసీ స్లీపర్ బస్సులకు ‘లహరి-అమ్మఒడి అనుభవం’ అని నామకరణం చేశారు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
తొలిసారిగా ప్రవేశపెడుతున్న ఏసీ స్లీపర్ బస్సులకు సరికొత్త సాంకేతికతను జోడించామని టీఎస్‌ఆర్‌టీసీ తెలిపింది. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని బస్సులకు ట్రాకింగ్ సిస్టమ్, పానిక్ బటన్ సౌకర్యం కల్పించారు. వీటిని టీఎస్‌ఆర్‌టీసీ కంట్రోల్ రూంకు అనుసంధానం చేస్తారు. ప్రయాణీకులకు ఏవైనా సమస్యలు ఎదురైతే పానిక్ బటన్‌ను నొక్కడం ద్వారా TSRTC కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించబడుతుంది. ఈ సమాచారం ద్వారా అధికారులు స్పందించి త్వరగా చర్యలు తీసుకుంటారు. 12 మీటర్ల పొడవున్న AC స్లీపర్ బస్సులు 30 బెర్త్‌ల సామర్థ్యం ఉంది. దిగువ 15, ఎగువ 15 బెర్త్‌ల వద్ద మొబైల్ ఛార్జింగ్ సౌకర్యంతో పాటు వాటర్ బాటిల్ సౌకర్యం ఉంటుంది. ప్రతి బెర్త్ వద్ద రీడింగ్ ల్యాంప్‌లను ఏర్పాటు చేశారు. ఈ బస్సుల్లో ఉచిత వై-ఫై సౌకర్యం కూడా ఉంది.
Also Read:Hyper Aadi: మెగాస్టార్ వెంట్రుక కూడా పీకలేరు.. వారికి ఆది వార్నింగ్
గమ్యస్థానాల వివరాలను చూపించడానికి బస్సు ముందు, వెనుక భాగంలో LED డిస్ప్లే బోర్డులు ఉన్నాయి. ప్రయాణీకుల భద్రత కోసం, బస్సులలో భద్రతా కెమెరాలను అమర్చారు. ప్రతి బస్సులో రివర్స్ పార్కింగ్ సహాయ కెమెరా కూడా ఉంటుంది. అత్యాధునిక ఫైర్ డిటెక్షన్, అలారం సిస్టమ్ (FDAS) వ్యవస్థాపించబడింది. బస్సులో మంటలు చెలరేగినప్పుడు వెంటనే అప్రమత్తం చేస్తుంది. కొత్త ఏసీ స్లీపర్ బస్సుల్లో ప్రయాణికులకు సమాచారం అందించేందుకు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఉంటుంది.
ఈ కొత్త సర్వీసులను ప్రారంభిస్తున్న సందర్భంగా తొలుత కొన్ని రోజుల పాటు టికెట్ ధరల్లో తగ్గింపును అమలు చేస్తున్నారు. కర్ణాటకలోని ప్రాంతాలకు వెళ్లే సర్వీసుల్లో 20 శాతం, ఇతర రూట్లలో తిరిగే బస్సుల్లో 15 శాతం మేర టికెట్ ధరలను తగ్గించనున్నారు.
తాజావార్తలు
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..