ఆర్టీసీ చార్జీల పెంపుపై క్లారిటీ ఇచ్చిన సజ్జనార్.. ఎంతంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ఆర్టీసీ చార్జీల పెంపుపై ఎప్పటి నుంచో చర్చ సాగుతూనే ఉంది… డీజిల్ ధరలు పెరగడం, కరోనా దెబ్బకొట్టడంతో.. చార్జీలు పెంచక తప్పదనే నిర్ణయానికి వచ్చింది టీఎస్‌ఆర్టీసీ.. అయితే, ఆర్టీసీ చార్జీలు ఎంతమేర పెంచనున్నారు అనేదానిపై క్లారిటీ ఇచ్చారు టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్.. డీజిల్ ధరలు పెరిగినప్పుడు మాత్రమే ఆర్టీసీ టిక్కెట్ ధరలు పెంచామని.. గడిచిన 2 సంవత్సరాల క్రితం డిసెంబర్ 1న 20 పైసల మేర చార్జీలు పెంచామని గుర్తుచేసిన ఆయన.. చార్జీలు పెంచినా ఆ లాభాలు ఆర్టీసీకి రాలేదని.. కరోనా మహమ్మారి కారణంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. కోవిడ్ వల్ల రవాణా రంగానికి కోలుకోలేని దెబ్బ తగిలిందన్న సజ్జనార్.. 251 మంది ఉద్యోగులు కోవిడ్ వల్ల చనిపోయారని తెలిపారు. ఇక, గతంలో లీటర్ డీజిల్ రూ. 68.29 ఉంటే.. అది ఇప్పుడు అనూహ్యంగా పెరిగిపోయిందని.. డీజిల్ ధరలు పెరగడం వల్ల ఏకంగా రూ. 480 కోట్ల నష్టం వాటిల్లిందని.. రూ.1,440 కోట్లు ఈ సంవత్సరం నష్టాలు ఉన్నాయని తెలిపారు.
Read Also: మన దగ్గరే అనుకుంటే పొరపాటే..! అక్కడ కూడా నేతల తిట్ల పురాణం..
Also Read
ఇక, చార్జీల పెంపునకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు ఇవ్వాల్సి ఉందన్నారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్.. 25 పైసలు పల్లె వెలుగుకు, 30 పైసలు ఎక్స్ ప్రెస్‌లకు, ఇతర సర్వీసులకు పెంచాలని కోరుతున్నామన్న ఆయన.. రోజుకు 14 కోట్ల ఆదాయం వస్తోంది. ఇప్పుడు డీజిల్ ధరలు పెరగడం వల్ల ప్రయాణికులు ఆర్టీసీని ఆశ్రయిస్తున్నారని తెలిపారు. చార్జీలు పెంచితే ఆర్టీసీ గాడిలో పడుతుందని ఆశిస్తున్నామన్న ఆయన.. ఇప్పటికే 525 కొత్త బస్సులు కొనుగోలు చేశాం… ఆర్టీసీలో అనేక మార్పులు తీసుకు వచ్చామని వెల్లడించారు. కాగా, ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత వినూత్న తరహాలో ఆర్టీసీకి ప్రచారం కల్పిస్తున్నారు.. అంతేకాదు.. ఆ సంస్థను లాభాల బాటలోకి నడిపిస్తున్నారు. ఓవైపు ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బందిలో భరోసా కల్పిస్తూనే.. మరోవైపు ప్రయాణికుల్లో నమ్మకం కలిగేలా చర్యలు తీసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలిస్తూ.. సమస్యల పరిష్కారానికి పూనుకుంటున్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వైభవ్ బౌలింగ్‌కు అంతా ఫిదా.. ఇషాన్ కిషన్‌కు తెలియని సీక్రెట్ ఇదే..!
-
Billa Ranga Baasha: సుదీప్ మూవీకి భారీ ప్లాన్.. ‘బిల్లా రంగ బాషా’ ప్రమోషనల్ క్యాలెండర్ అవుట్
-
Ather Konarc Launched: తక్కువ ధరలో ఎక్కువ రేంజ్.. మెటల్ బాడీ, స్మార్ట్ ఫీచర్లతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్
-
Taapsee Pannu: టాలీవుడ్లోకి తాప్సీ రీ ఎంట్రీ.. ఆ డైరెక్టర్‌తో హారర్ మూవీ?
-
H-1B Visa Rules: H-1B ఉద్యోగులకు ట్రంప్ సర్కార్ షాక్.. 60 రోజుల గ్రేస్ పీరియడ్ తొలగించే ప్రతిపాదనకు కీలక ఆమోదం
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్‌ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!