Taapsee Pannu: టాలీవుడ్లోకి తాప్సీ రీ ఎంట్రీ.. ఆ డైరెక్టర్‌తో హారర్ మూవీ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Taapsee Pannu: తెలుగులో హీరోయిన్గా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తాప్సీ పన్ను ఇప్పుడు మరోసారి టాలీవుడ్ వైపు అడుగులు వేస్తున్నారా? ప్రస్తుతం ఆమె సినిమాల కంటే వెబ్ సిరీస్‌లతో ఎక్కువగా బిజీగా ఉన్న నేపథ్యంలో, తెలుగులో ఆమె రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్త ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా ఈసారి ఆమె ఎంచుకోబోతున్న సినిమా జానర్ కూడా ప్రత్యేకంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ‘కొరియన్ కనకరాజు’తో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన దర్శకుడు మేర్లపాక గాంధీ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ఓ హారర్ కథను సిద్ధం చేసుకున్నారట. ఈ సినిమాలో ప్రధాన పాత్ర కోసం తాప్సీ పన్నును సంప్రదించినట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ చర్చల దశలోనే ఉందని, హీరోయిన్గా తాప్సీ ఇంకా ఆఫీషియల్ గా ఖరారు కాలేదని తెలుస్తోంది.
మేర్లపాక గాంధీ గతంలో ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’, ‘ఎక్స్‌ప్రెస్ రాజా’, ‘కృష్ణార్జున యుద్ధం’, ‘మాస్ట్రో’, ‘లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్’ వంటి విభిన్న చిత్రాలను తెరకెక్కించారు. ఇటీవల వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ‘కొరియన్ కనకరాజు’తో మంచి హిట్ ను కూడా అందుకున్నారు . ఇప్పుడు అదే దర్శకుడు మరో హారర్ కథతో ముందుకు వస్తున్నట్లు సమాచారం. ఈసారి కథకు తాప్సీ లాంటి నటిని ఎంచుకోవడం ఆసక్తికరంగా మారింది. తాప్సీకి ఇప్పటికే లేడి ఓరియెంటెడ్ కథలతో మంచి అనుభవం ఉంది. తెలుగు చిత్రసీమలో ఆమె ‘ఝుమ్మంది నాదం’, ‘వస్తాడు నా రాజు’, ‘మిస్టర్ పర్ఫెక్ట్’, ‘గుండెల్లో గోదారి’ వంటి సినిమాల్లో కూడా నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత బాలీవుడ్‌కు వెళ్లి కెరీర్‌ను పూర్తిగా మరో స్థాయికి తీసుకెళ్లారు.
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
తాప్సీ ప్రస్తుతం హిందీ సినిమాలతో పాటు ఓటీటీ ప్రాజెక్టుల్లోనూ కనిపిస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్ కోసం ఆమె నటించిన ‘గాంధారి’ 2026 సెప్టెంబర్ 3న రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో మేర్లపాక గాంధీ హారర్ కథ ఆమెకు నచ్చితే, చాలా కాలం తర్వాత తెలుగులో మరో ఆసక్తికరమైన పాత్రలో కనిపించే అవకాశం ఉంటుంది. ఈ ప్రాజెక్ట్‌ను యూవీ క్రియేషన్స్ నిర్మించే అవకాశం ఉందని కూడా సమాచారం. అయితే హీరోయిన్ ఎంపిక నుంచి కథ, నటీనటులు, షూటింగ్ ప్రారంభం వరకు ఏ అంశంపైనా ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. తాప్సీతో చర్చలు సానుకూలంగా ముగిస్తేనే ఈ కాంబినేషన్‌పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
మొత్తంగా చూస్తే, బాలీవుడ్లో తనదైన గుర్తింపు సంపాదించిన తాప్సీ పన్ను మళ్లీ తెలుగు సినిమాలో కనిపిస్తే అది ఆమె అభిమానులకు ప్రత్యేక ట్రీట్ అవుతుంది. అందులోనూ మేర్లపాక గాంధీ లాంటి దర్శకుడితో హారర్ కథలో ఆమె నటిస్తే, ఈ కాంబినేషన్ ఎలా ఉండబోతుందనే ఆసక్తి ఇప్పటి నుంచే మొదలైంది. మరి చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ నిజంగానే పట్టాలెక్కుతుందా, తాప్సీ టాలీవుడ్ రీ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా అనేది చూడాలి.
- Tags
- cinema
- Taapsee Pannu
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు