Ather Konarc Launched: తక్కువ ధరలో ఎక్కువ రేంజ్.. మెటల్ బాడీ, స్మార్ట్ ఫీచర్లతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ather Konarc Launched: ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ తన కొత్త ఏథర్ కోనార్క్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. కంపెనీకి చెందిన కొత్త EL ప్లాట్‌ఫామ్‌పై రూపొందించిన తొలి స్కూటర్ ఇదే. మెటల్ బాడీతో పాటు స్మార్ట్ రిమోట్ కీ, Airwalk వంటి పలు అధునాతన ఫీచర్లను ఇందులో అందించారు. కోనార్క్‌ను కంపెనీ మొత్తం ఆరు వేరియంట్లలో పరిచయం చేసింది. ఇందులో S-Lineలో నాలుగు వేరియంట్లు, Z-Lineలో రెండు వేరియంట్లు ఉంటాయి. అయితే ప్రస్తుతం అన్ని వేరియంట్లు అందుబాటులో లేవు. తొలిదశలో మూడు వేరియంట్లను మాత్రమే అందుబాటులోకి తీసుకువస్తున్నారు.
రూ.99,999 నుంచి ప్రారంభ ధర
ఏథర్ కోనార్క్ ఎక్స్-షోరూమ్ ధర రూ.99,999 నుంచి ప్రారంభమవుతుంది. S-Lineలో 100 కిలోమీటర్ల రేంజ్ వేరియంట్ ధర రూ.99,999గా ఉంది. 125 కిలోమీటర్ల రేంజ్ వేరియంట్ ధర రూ.1,21,999 కాగా, 161 కిలోమీటర్ల రేంజ్ వేరియంట్ ధర రూ.1,44,999గా నిర్ణయించారు. మిగిలిన మూడు వేరియంట్ల ధరలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. S-Line వేరియంట్ డెలివరీలు సెప్టెంబర్ 21 నుంచి ప్రారంభం కానున్నాయి.
Also Read
- Tata Motors దూకుడు మాములుగా లేదుగా.. 10 నెలల్లోనే గతేడాది లెక్కలు తారుమారు.!
- Kove 650RR: 650cc స్పోర్ట్స్ బైక్‌లో ఫ్రంట్, రియర్ కెమెరాలు.. 108.7hp పవర్‌తో Kove 650RR ఎంట్రీ
- Toyota Innova Hycross Facelift: E100 ఇథనాల్ టెక్నాలజీతో నవంబర్ 25న కొత్త ఇన్నోవా హైక్రాస్ లాంచ్..!
- BYD Denza Z9 GT: భారత్‌లో BYD Denza Z9 GT లాంచ్.. 2.7 సెకన్స్ లో 100 kmph స్పీడ్, 670KM రేంజ్!
200 కిలోమీటర్ల రేంజ్
ఏథర్ కోనార్క్ S-Line మొత్తం నాలుగు రేంజ్ ఆప్షన్లలో లభిస్తుంది. బేస్ వేరియంట్ 100 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. 125 కిలోమీటర్లు, 161 కిలోమీటర్ల రేంజ్ వేరియంట్ల డెలివరీలు సెప్టెంబర్‌లో ప్రారంభం కానున్నాయి. ఇక, 200 కిలోమీటర్ల రేంజ్ అందించే వేరియంట్ వచ్చే ఏడాది మూడో త్రైమాసికంలో మార్కెట్లోకి రానుంది. Z-Series 2027 రెండో త్రైమాసికంలో అందుబాటులోకి రానుంది. 100 కిలోమీటర్ల వేరియంట్ డెలివరీలు వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది.
మెటల్ బాడీ.. స్మార్ట్ ఫీచర్లు
కోనార్క్ ఏథర్ నుంచి మెటల్ బాడీతో వస్తున్న తొలి స్కూటర్ కావడం విశేషం. ఇందులో స్మార్ట్ రిమోట్ కీతో పాటు Airwalk ఫీచర్‌ను అందించారు. ఈ ఫీచర్ సహాయంతో స్కూటర్‌ను ముందుకు, వెనక్కి సులభంగా కదిలించుకోవచ్చు. S-Line వేరియంట్ 200 కిలోమీటర్ల వరకు రేంజ్, గంటకు 70 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందిస్తుంది. ఈ వేరియంట్ నాలుగు రంగుల్లో లభిస్తుంది. మరోవైపు Z-Line వేరియంట్ IDC ప్రకారం 161 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 80 కిలోమీటర్లు కాగా, ఐదు రంగుల ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.
ఏథర్ కోనార్క్ ప్రత్యేకతలు
కొత్త EL ప్లాట్‌ఫామ్, మెటల్ బాడీ, స్మార్ట్ రిమోట్ కీ, Airwalk వంటి ఫీచర్లతో కోనార్క్‌ను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. రూ.1 లక్షలోపే ప్రారంభమయ్యే ధరతో పాటు భవిష్యత్తులో 200 కిలోమీటర్ల రేంజ్ వేరియంట్ కూడా అందుబాటులోకి రానుండటంతో ఈ స్కూటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో పోటీని పెంచే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Israel Hezbollah: ఓవైపు కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై చర్యలు.. హిజ్బుల్లాపై ఇజ్రాయిల్ మెరుపుదాడి!
-
Surya Kumar Yadav: టీమ్‌లోకి మళ్లీ సూర్యకుమార్ యాదవ్..? బ్యాటింగ్‌లో మరోసారి విధ్వంసం..
-
Bollywood : ఒకవైపు రణ్వీర్ సింగ్, మరోవైపు రణ్‌బీర్ కపూర్.. స్టార్ పవరా? సీక్వెల్స్ క్రేజా?
-
Smart Phone Prices Hike: సెల్‌ఫోన్ లవర్స్‌కు బ్యాడ్‌న్యూస్.. ఈ రెండు కంపెనీల ఫోన్ల ధరలు భారీగా పెంపు..
-
Sai Pallavi : జుట్టు కట్ చేస్తున్నానని తెలిసి మా అమ్మ ఫోన్ కట్ చేసింది.. పెద్ద దుమారమే రేపింది
ట్రెండింగ్
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్‌తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్‌గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!