Mohan Bhagwat: న్యూయార్క్‌లో మోహన్ భగవత్ ర్యాలీపై రగడ.. ఈవెంట్ నిర్వాహకులకు బిగ్ షాక్
- న్యూయార్క్‌లో మోహన్ భగవత్ ర్యాలీపై రగడ
- నిర్వాహకుల ‘ఎక్స్’ ఖాతా సస్పెండ్
- ర్యాలీకి అనుమతించబోమన్న న్యూయార్క్ మేయర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ న్యూయార్క్ పర్యటన వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. న్యూయార్క్‌లో మోహన్ భగవత్ పాల్గొననున్న కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు, విమర్శలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమ నిర్వాహక సంస్థ అమెరికన్ హిందూస్ ఫర్ ఎంగేజ్మెంట్ అండ్ డైలాగ్ ఫోరమ్‌కు చెందిన ‘ఎక్స్’ ఖాతాను సోషల్ మీడియా వేదిక సస్పెండ్ చేసింది. ప్రస్తుతం ఆ ఖాతా యూజర్లకు అందుబాటులో లేకుండా ‘Unavailable’గా కనిపిస్తోంది.
న్యూయార్క్‌లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్లో ఆగస్టు 29న ‘యూనివర్సల్ వనెస్ సెలబ్రేషన్’ పేరుతో కార్యక్రమం జరగనుంది. ఇందులో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రధాన ప్రసంగం చేయనున్నారు. ఈ నేపథ్యంలో కార్యక్రమ నిర్వాహకుల ‘ఎక్స్’ ఖాతా సస్పెన్షన్ చర్చనీయాంశంగా మారింది.
Also Read
- Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
- Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
- PIA Uniform Makeover: పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్‌పై ట్రోలింగ్.. కొత్త యూనిఫామ్‌పై నెటిజన్ల ప్రశ్నలు..
- Iran-US Talks: అమెరికాతో చర్చలకు ఇరాన్ 7 షరతులు.. ట్రంప్ తిరస్కరిస్తే నిర్ణాయక యుద్ధానికి సిద్ధమంటూ హెచ్చరిక
పొరపాటుతో సస్పెండ్ చేశారా?
వార్తా సంస్థ పీటీఐ ప్రకారం.. తమ ‘ఎక్స్’ ఖాతా సస్పెన్షన్ పొరపాటుగా జరిగి ఉండొచ్చని ఈవెంట్ నిర్వాహకుల ఫోరమ్ తెలిపింది. తమ సోషల్ మీడియా కమ్యూనికేషన్ మొత్తం సార్వత్రిక శాంతి, ఐక్యత, సామరస్యం, మతాంతర-సాంస్కృతిక సంభాషణను ప్రోత్సహించేలా ఉందని పేర్కొంది. ‘ఎక్స్’ నిబంధనలకు అనుగుణంగానే తమ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని సంస్థ వెల్లడించింది.
మోహన్ భగవత్ కార్యక్రమంపై వివాదం
మోహన్ భగవత్ పాల్గొననున్న కార్యక్రమంపై న్యూయార్క్‌లో రాజకీయంగా కూడా వివాదం కొనసాగుతోంది. న్యూయార్క్ మేయర్ మమ్దానీ ఆర్ఎస్ఎస్పై బహిరంగంగా విమర్శలు చేశారు. ఆగస్టు 29న మాడిసన్ స్క్వేర్ గార్డెన్లో మోహన్ భగవత్ పాల్గొనే కార్యక్రమానికి తాను మద్దతు ఇవ్వబోనని స్పష్టం చేశారు. మరోవైపు అమెరికా కాంగ్రెస్ ఏర్పాటు చేసిన మత స్వేచ్ఛపై సలహా సంస్థ USCIRF కూడా మోహన్ భగవత్ అమెరికా పర్యటనపై ఆందోళన వ్యక్తం చేసింది. భగవత్ ఇప్పటికే అమెరికాలో ఉన్న నేపథ్యంలో.. ఆయన వీసాను రద్దు చేయాలని ట్రంప్ ప్రభుత్వాన్ని కోరినట్లు పీటీఐ నివేదించింది. ఆర్ఎస్ఎస్కు అనుబంధంగా ఉన్న కొన్ని సంస్థలు మతపరమైన మైనారిటీలపై హింసాత్మక దాడులకు పాల్పడ్డాయని USCIRF ఆరోపించినట్లు సమాచారం. ఈ ఆరోపణల నేపథ్యంలోనే భగవత్ పర్యటనపై ఆ సంస్థ అభ్యంతరాలు వ్యక్తం చేసింది.
మూడు దేశాల పర్యటనలో మోహన్ భగవత్
మోహన్ భగవత్ ప్రస్తుతం మూడు దేశాల పర్యటనలో భాగంగా అమెరికాలో ఉన్నారు. అమెరికాతో పాటు కెనడా, బ్రిటన్‌లో ఆయన పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగానే న్యూయార్క్‌లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్లో ఆగస్టు 29న ‘యూనివర్సల్ వనెస్ సెలబ్రేషన్’ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
తాజావార్తలు
-
Hamid Ansari row: ‘‘ దేశానికి హిందువులు ముప్పా.?’’.. హమీద్ అన్సారీ వ్యాఖ్యలపై దుమారం..
-
Vedant Madhavan: ప్రౌడ్ ఫాదర్ మూమెంట్.. ఏషియన్ గేమ్స్ బరిలో మాధవన్ కుమారుడు!
-
Garba Row: గర్బాలో ముస్లింల ఎంట్రీపై వివాదం.. నుదిటిపై తిలకం తప్పనిసరి!
-
CM Chandrababu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
-
Upcoming IPOs : వచ్చే వారం మార్కెట్లో ఐపీఓల జాతర.. ఏకంగా 19 కంపెనీల ఎంట్రీ! పూర్తి వివరాలు ఇవే..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!