కొత్త రూల్స్.. ఈ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే అంతే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ట్రాఫిక్ నిబంధనలను ఉల్లఘించినవారిపై జరిమానా విధించడమే కాదు.. నిబంధనలను ఉల్లంఘిచినవారికి నోటీసులు పంపడంపై కూడా ఫోకస్ పెట్టింది కేంద్ర ప్రభుత్వం..దీనికి కోసం కేంద్రం కొత్త ఆదేశాలు జారీ చేసింది. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారికి 15 రోజుల్లోగా నోటీసులు పంపాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. మోటారు వాహన సవరణ చట్టాన్ని అనుసరించి… కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారులశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. దేశంలోని 10 లక్షలు మించి జనాభా ఉన్న నగరాలకూ, నోటిఫికేషన్‌లో పేర్కొన్న 132 నగరాలకూ ఈ నిబంధనలు వర్తించనున్నాయి.
కేంద్రం జారీ చేసిన నోఫికేషన్ ప్రకారం.. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినవారికి ఆయా రాష్ట్రాలు 15 రోజుల్లోగా నోటీసులు పంపాలి.. సంబంధిత వ్యక్తి చలాన్ కట్టేంతవరకూ రికార్డులను భద్రపరచాలి.. నిబంధనలు ఉల్లంఘించినవారికి చలాన్ల జారీకి ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించాలి.. స్పీడ్ కెమెరా, సీసీటీవీ, స్పీడ్ గన్, బాడీ కెమెరా, డ్యాష్ బోర్డ్ కెమెరా… ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్, వే-ఇన్ యంత్రాలు చలాన్ల జారీకి ఉపయోగించాలి.. జాతీయ, రాష్ట్ర రహదారులు, అధిక ముప్పు ఉన్న ప్రాంతాలు, కీలక జంక్షన్లు, రాకపోకలు అధికంగా ఉండే కారిడార్ల వద్ద వీటిని ఏర్పాటు చేయాలి.. హెల్మెట్ ధరించకపోవడం, పరిమితికి మించిన వేగంతో వెళ్లడం, నో పార్కింగ్ ప్రాంతంలో వాహనాలను నిలపడం, రెడ్ లైట్ జంపింగ్, నిబంధనలకు విరుద్ధంగా వాహనాలను ఓవర్ టేక్ చేయడం వంటి అపరాధాలకు సీసీ టీవీ ఆధారంగా నోటీసులు జారీ చేయొచ్చని తాజా నోటిఫికేషన్‌లో పేర్కొంది కేంద్రం..
Also Read
తాజావార్తలు
-
Andhra Pradesh Tax Revenue: ఏపీ ఖజానాకు ఊహించని ఊపు.. ఆగస్టులో భారీగా పెరిగిన పన్నుల ఆదాయం
-
SCO Summit: పాక్ ప్రధాని ముందే ఉగ్రవాదంపై మోడీ స్ట్రాంగ్ మెసేజ్
-
Tilak Varma: ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం.. తిలక్ వర్మకు కెప్టెన్సీ పగ్గాలు..!
-
Imran Khan Gets Relief: ఇమ్రాన్ ఖాన్కు పాక్ కోర్టులో భారీ ఊరట..
-
Mamata Banerjee: మమతా బెనర్జీ ఇంట్లో విషాదం.. మేనకోడలు ఆత్మహత్య
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!