మోరిస్ గ్యారేజెస్ మోటార్ ఇండియా తన ఎలక్ట్రిక్ కారు MG కామెట్ EVని నేడు విడుదల చేయనుంది. ఈ కారు ధరను ఈరోజు వెల్లడించనుంది. ఇది కార్ల తయారీదారు నుండి చౌకైన, చిన్నదైన, ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ కారు. గుజరాత్‌లోని హలోల్ ప్లాంట్‌లో దీని ఉత్పత్తి ప్రారంభమైంది. ఈ కారు టాటా మోటార్స్ టియాగో EVకి పోటీగా ఉంటుంది. MG ZS EV తర్వాత MG కంపెనీ నుంచి వస్తున్న రెండోవ EV కారు ఇది. స్మార్ట్ ఎలక్ట్రిక్ కారు పేరును కంపెనీ మార్చి 2న ప్రకటించింది. అప్పటి నుండి, కంపెనీ తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా కారు గురించి ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లు ఇస్తోంది.
Also Read:Robbers: బాసరలో దోపిడీ దొంగల హల్చల్..
కారు లోపలి భాగాన్ని, డ్యాష్‌బోర్డ్, సీట్ అప్హోల్స్టరీని కంపెనీ టీజర్‌లో ప్రదర్శించింది. MG కామెట్‌కు టాల్‌బాయ్ డిజైన్‌ను ఇవ్వడానికి ప్రయత్నించింది. ఇది 2 డోర్ల కారు. ముందు భాగంలో ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఎంజీ లోగో, డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్, వెనుకవైపు ఎల్ఈడీ టెయిల్ లైట్లు, 12-అంగుళాల స్టీల్ వీల్స్‌తో పాటు వీల్ కవర్లు, క్రోమ్ డోర్ హ్యాండిల్స్, ఫ్రంట్, రియర్ పార్కింగ్ కెమెరాలు ఉన్నాయి.
MG కామెట్ EV క్యాండీ వైట్, బ్లాక్ రూఫ్‌తో ఆపిల్ గ్రీన్, బ్లాక్ రూఫ్‌తో క్యాండీ వైట్, అరోరా సిల్వర్, స్టార్రీ బ్లాక్‌తో సహా 5 రంగుల్లో అందుబాటులో ఉంటుంది. కారు ధర రూ. 10 లక్షల వరకు ఉండవచ్చు. MG తన కార్లకు చారిత్రక విషయాల పేర్లను పెట్టింది. ఈ కారుకు బ్రిటిష్ విమానం కామెట్ పేరు పెట్టారు. రూ. 25 లక్షల లోపు రెండు ఎలక్ట్రిక్ కార్లు – MG ZS EV, MG కామెట్ EVలతో – 2023లో భారతదేశ ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలలో 30 శాతం మార్కెట్ వాటాను పొందాలని వాహన తయారీ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.
Also Read:Aishwarya Rai : అవి కనిపించకుండా కవర్ చేస్తున్న ఐశ్వర్య రాయ్