TS: హస్తిన నుంచి గవర్నర్ తమిళిసైకి పిలుపు.. ఏం జరుగుతోంది..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో గత కొంత కాలంగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.. అధికారపక్షానికి, గవర్నర్‌కు క్రమంగా దూరం పెరుగుతూ పోతోంది.. కొన్ని సార్లు ప్రత్యక్షంగా.. పరోక్షంగా ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్‌పై కామెంట్లు కూడా చేశారు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్.. ఈ మధ్య రాజ్‌భవన్ వేదికగా నిర్వహించిన ఉగాది వేడుకల్లోనూ.. ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.. సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలను ఉగాది ఉత్సవాలకు ఆహ్వానించినా వారు ఎవరు రాలేదని గవర్నర్ తమిళిసై అసంత్రృప్తి వ్యక్తం చేశారు. ప్రతిసారి ప్రభుత్వ పెద్దలను ఆహ్వానించినా వారు నా ఆహ్వానాన్ని పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించిన ఆమె.. యాదాద్రి సంప్రోక్షణకు తనకు వెళ్లాలని ఉన్నా ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందలేదన్నారు.. రాజ్ భవన్ పరిమితులేమిటో తనకు తెలుసునని.. శక్తిమంతురాలినైన తన తలను ఎవరూ వంచలేరంటూ హాట్ కామెంట్లు చేశారు.. ఇక, తనకు ఎలాంటి ఇగో లేదని అందరితో సక్యంగా ఉండే స్నేహపూర్వక వైఖరి తనదని పేర్కొన్నారు తమిళిసై.. అయితే, ఇప్పుడు హస్తిన నుంచి ఆమెకు పిలుపు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది..
Read Also: Rahul Gandhi: నా వారసుడు రాహుల్ గాంధీయే..! తన ఆస్తినంతా రాసిచ్చిన మహిళ
Also Read
- Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్‌గాంధీని ప్రశ్నించిన బీజేపీ
- Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
కేంద్ర హోంశాఖ నుంచి పిలుపు రావడంతో.. ఇవాళ రాత్రికి ఢిల్లీకి వెళ్తున్నారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్… రేపు హస్తినలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.. అసలే.. రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్‌కు క్రమంగా దూరం పెరుగుతోన్న తరుణంలో తమిళిసై.. ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.. మరోవైపు, తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఢిల్లీలోనే ఉండటంతో గవర్నర్ పర్యటన ఉత్కంఠ రేపుతోంది. అయితే, గవర్నర్ తన ఢిల్లీ పర్యటనలో ఎవరితో సమావేశం అవుతారు..? ఎలాంటి విషయాలను చర్చిస్తారు అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. గర్నవర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ బడ్జెట్ సెషన్ ప్రారంభం కావడం నుంచి తాజాగా జరిగిన పరిణామాలు.. గవర్నర్‌కు.. ప్రభుత్వానికి మధ్య గ్యాప్‌ను స్పష్టంగా బయటపెడుతున్నాయి.. గవర్నర్‌గా తమిళిసై వచ్చిన తర్వాత ఆదిలో కొంత మంచి వాతావరణం ఉన్నా.. తర్వాత దూరం పెరగడం మాత్రం చర్చగా మారింది.. ఇక, ప్రజల సమస్యల పరిష్కారం కోసమే రాజ్ భవన్ లో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసినట్లు కూడా తెలిపారు తమిళిసై… గ్రీవెన్స్ సెల్ ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి సూచించినట్లు చెప్పారు.. ప్రతి నెల రెండో మంగళవారం రాజ్ భవన్‌లో ప్రజా దర్బార్ నిర్వహించేందుకు సిద్ధం అయ్యారు.. ఈ తరుణంలో.. ఆమె హస్తిన పర్యటన.. దాని ఫలితాలు ఎలా ఉంటాయి..? అనేది మాత్రం ఉత్కంఠ రేపుతోంది.
తాజావార్తలు
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి ఏ రోజూ జై తెలంగాణ అనలేదు.. మాజీ మంత్రి సంచలన ఆరోపణ..
-
Gautam Gambhir: మన హద్దులు దాటాలి.. శ్రీలంక టెస్ట్ సిరీస్‌కు ముందు టీమిండియాకు గంభీర్ వార్నింగ్
-
Salman Khan: సల్మాన్ ఖాన్ ఖాతాలో మరో కొత్త కేసు… రూ.3 కోట్ల మోసం కేసులో కోర్టు సమన్లు!
-
India Post Recruitment 2026: 10th పాసయ్యారా?.. ఇండియా పోస్ట్‌లో ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం.. మంచి జీతం
ట్రెండింగ్
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!