మళ్లీ ఢిల్లీకి సీఎం కేసీఆర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు మరోసారి హస్తిన పర్యటనకు వెళ్లనున్నారు.. ఈ నెల ఆరంభంలో ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్.. హస్తినలో టీఆర్‌ఎస్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.. ఆ తర్వాత దాదాపు వారం రోజుల పాటు అక్కడే మకాం వేశారు.. ప్రధాని నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్‌షా సహా పలువురు కేంద్ర మంత్రులను, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తదితరులను కలిశారు.. ఓవైపు రాష్ట్ర సమస్యలపై చర్చిస్తూనే.. మరోవైపు.. యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ఆహ్వానించారు.. అయితే, మరోసారి హస్తినకు వెళ్లనున్నారు సీఎం కేసీఆర్.. ఎల్లుండి ఢిల్లీకి వెళ్లనున్న ఆయన.. నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొననున్నారు.. ఈ సమావేశం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అధ్యక్షతన జరగనుంది.. అయితే, గతంలో జరిగిన ఈ సమావేశానికి కేసీఆర్ హాజరుకాకపోవడంతో.. విమర్శలు కూడా వచ్చాయి. ఇక, ఈ పర్యటనలో.. ఇంకా ఎవరినైనా కలిసే అవకాశం ఉందా? అనేది తెలియాల్సి ఉంది. మొత్తంగా ఒకే నెలలో రెండోసారి తెలంగాణ సీఎం.. ఢిల్లీ పర్యటనకు వెళ్లడం ఆసక్తికరంగా మారింది.
Also Read
తాజావార్తలు
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్‌బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Virat Kohli: మళ్లీ టెస్టుల్లోకి విరాట్ కోహ్లీ..? జూలై 14 నుంచి మైదానంలోకి కింగ్..
-
Badangpet Warehouse Blast: బడంగ్పేట్లో ఘోరం.. డెకరేషన్ గోదాంలో కెమికల్ బాక్స్ పేలి కార్మికుడు మృతి.!
-
Sahan: మా బౌలర్లు బెంబేలెత్తిపోయారు.. అది బ్యాటింగ్ అంటారా..? విధ్వంసం: శ్రీలంక కెప్టెన్ సహన్
-
Cucumber Idli: బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్.. కేవలం నిమిషాల్లో దోసకాయ ఇడ్లీ ఇలా చేసేయండి!
ట్రెండింగ్
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!