Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Telangana Cabinet Meeting Today At Pragati Bhavan

Cabinet: ముగుస్తున్న డెడ్‌లైన్‌… కేసీఆర్‌ కీలక నిర్ణయం..!?

Published Date :April 12, 2022 , 8:13 am
By Sudhakar Ravula
Cabinet: ముగుస్తున్న డెడ్‌లైన్‌… కేసీఆర్‌ కీలక నిర్ణయం..!?
  • Follow Us :
  • google news
  • dailyhunt

సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్‌లో మీటింగ్ జరగనుంది. ఈ నెల 3న ఢిల్లీ వెళ్లిన కేసీఆర్… నిన్న హైదరాబాద్ చేరుకున్నారు. రాష్ట్రంలో బర్నింగ్ ఇష్యూ అయిన యాసంగి వడ్ల కొనుగోళ్లపైనే కేబినెట్‌ లో ప్రధాన చర్చ జరగనున్నట్టు సమాచారం. రాష్ట్రంలో ఈ నెల 1 నుంచే యాసంగి వడ్లు మార్కెట్లకు రావడం మొదలైంది. కేంద్రం బాయిల్డ్ రైస్ కొనబోమని చెప్పినందున తాము కూడా యాసంగి వడ్లు కొనబోమని గతంలోనే ప్రకటించింది కేసీఆర్ సర్కార్. అయితే రాష్ట్రంలో సమస్య తీవ్రం కావడంతో… దానిపై చర్చించేందుకు మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.

Read Also: Pawan Kalyan: జనసేనాని రైతు భరోసా యాత్ర.. కౌలు రైతు కుటుంబాలకు పరామర్శ..

యాసంగి వడ్లు కొనాల్సిందేనంటూ… నిన్న ఢిల్లీలో ఆందోళన చేసింది టీఆర్ఎస్. కేంద్రానికి 24గంటల టైమ్‌ ఇస్తున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. ఈ మధ్యాహ్నంతో ఆ గడువు ముగియనుంది. దీంతో కేసీఆర్ ఏం చేస్తారన్న ఆసక్తి ఏర్పడింది. కేంద్రం నుంచి కొత్తగా స్పందన వచ్చే అవకాశం కనిపించడంలేదు. యాసంగిలో దాదాపు 40 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొనాల్సి వస్తుందని అంచనా. రైతుల దగ్గర వడ్లు కొనుగోలు చేసి రా రైస్‌ గా మారిస్తే ఎంత నష్టం వస్తుంది. దాన్ని ఎలా భరించాలి. రైతుల దగ్గర వడ్లు కొని మిల్లర్లకు అమ్మడం ఇలాంటి అంశాలపై కేబినెట్ మీటింగ్‌లో చర్చ జరిగే అవకాశముందని తెలుస్తోంది. కేంద్రం వడ్లు కొనకపోయినా… తెలంగాణ పేదరికంలో ఏమీ లేదని నిన్నటి సభలో కేసీఆర్ చెప్పారు. దీనిబట్టి చూస్తే ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేస్తుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

వడ్ల కొనుగోళ్లపై రాజకీయ, ప్రభుత్వ పోరాటాలకు తోడుగా న్యాయపరంగానూ పోరాడాలని కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు సమాచారం. పంజాబ్ తరహాలో వడ్లు కొనాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. అలాగే దేశవ్యాప్తంగా ఒకే కొనుగోళ్ల విధానంపై జాతీయ స్థాయిలో సదస్సు నిర్వహించే ఆలోచన కూడా కేసీఆర్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక వడ్ల కొనుగోళ్లతో పాటు ఉద్యోగాల భర్తీ, రెండో దశ ఆర్థిక శాఖ అనుమతుల జారీ, నోటిఫికేషన్లకు అనుమతులు లాంటి అంశాలు కూడా కేబినెట్ మీటింగ్‌లో చర్చకు రానున్నాయి. అలాగే ఉద్యోగ నియామకాల్లో ఇంటర్వ్యూల ఎత్తివేతపైనా నిర్ణయం తీసుకునే అవకాశముంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cm kcr
  • hyderabad
  • paddy procurement
  • telangana
  • TS Cabinet Meeting

తాజావార్తలు

  • Flying Flea C6 Bike: రాయల్ ఎన్‌ఫీల్డ్ తొలి ఎలక్ట్రిక్ బైక్.. 3.7 సెకన్లలో 60 km/h వేగం.. 154KM రేంజ్

  • Peddi: రామ్ చరణ్ ‘పెద్ది’ స్పెషల్ సాంగ్‌లో.. మిస్ ఇండియా!

  • YS Jagan: అమరావతి అవినీతి గని.. MAVIGUN ప్రణాళికే బెస్ట్‌..!

  • Shouryuv: ఆ ఒక్క కారణంతోనే మృణాల్‌ని ఫిక్స్ చేశా.. డైరెక్టర్ శౌర్యువ్ మాటలకు నాని షాక్!

  • Lenin vs Peddi : ‘లెనిన్’ దిగుతున్నాడు.. ‘పెద్ది’ పరిస్థితేంటి? 

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions