ఏపీలో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ సత్తా చాటింది. తూర్పు రాయలసీమ, ఉత్తరాంధ్ర స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం టీడీపీ కైవసం అయింది. ప్రముఖ అధ్యాపకుడు వేపాడ చిరంజీవి అనూహ్యమైన విజయం సాధించారు. ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనంతరం ఆయన గెలుపును ఎన్నికల సంఘం ప్రకటించింది. చతుర్ముఖ పోటీ జరిగిన ఉత్తరాంధ్ర స్థానంలో మొత్తం ఓటర్లు 2లక్షల 89 వేల 214మంది. ఈనెల 13న జరిగిన ఎన్నికల్లో రెండు లక్షల ఒక వెయ్యి 335ఓట్లు నమోదయ్యాయి. వీటిలో 69శాతం పైగా పోలింగ్ నమోదైంది. వీటిలో ఎక్కువ ఇన్ వ్యాలీడ్ ఓట్లు రాగా.. ఆ సంఖ్య 12వేల 318. ఈ ఓట్లు పోగా లెక్కింపుకు అర్హత కలిగినవి లక్ష 89 వేల 17. స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియంలో లెక్కింపు ప్రారంభించగా ఫలితం వెలువడెందుకు 48గంటలకు పైగా సమయం పట్టింది.
Also Read:Amit Shah: ఆస్కార్ వచ్చాక అమిత్‌షాని కలిసిన రామ్ చరణ్, చిరంజీవి
పాలైన ఓట్లలో లెక్కించేందుకు అర్హత కలినవి లక్ష 89వేల 17ఒట్లుగా నిర్ధారించి కౌంటింగ్ చేపట్టారు. వీటిలో సగం కంటే ఎక్కువ ఓట్లు నమోదు అయిన అభ్యర్థి గెలిచినట్టు లెక్క. ఈ ప్రకారం 94 వేల 509 ఓట్లు అవసరం అయ్యాయి. మొదటి ప్రాధాన్యత ఓటును లెక్కించగా.. 8 రౌండ్స్ లోనూ టిడిపి దూసుకు వెళ్ళింది. పార్టీ అభ్యర్థి వేపాడకు 82 వేల 958 ఓట్లు వచ్చాయి.దీంతో విజయానికి ఇంకా 11 వేల 551 ఓట్లు అవసరం అయింది. దీంతో ద్వితీయ ప్రాధాన్యత ఓటును లెక్కించాలిసీ వచ్చింది. ఇందుకు అవసరమైన కోటా ఓట్లు సాధించేందుకు మళ్ళీ కౌంటింగ్ జరిగింది. ఎలిమి నేషన్ విధానంలో 33మంది ఇండిపెండెంట్లు ద్వారా 786., బీజేపీ అభ్యర్థి నుంచి మూడు వేలు.,పీడీఎఫ్ రమాప్రభ ద్వారా 4500ఓట్లు వేపాడ చిరంజీవికి లభించాయి.
Also Read:Amit Shah: హైదరాబాద్ టీచర్ ఎమ్మెల్సీ గెలుపుపై అమిత్ షా హర్షం.. నడ్డా అభినందనలు
తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి గెలిచిన కంచర్ల శ్రీకాంత్ గెలిచారు. చిత్తూరు ఎస్వీసెట్ కళాశాలలో రెండో రోజైన ఓట్ల లెక్కింపు కొనసాగింది. ఏడు రౌండ్లలో 2 లక్షల 69 వేల 339 ఓట్లు పోలవ్వగా ఇందులో 20 వేల 979 ఓట్లు చెల్లలేదు. మిగిలిన 2 లక్షల 48 వేల 360 ఓట్లు లెక్కించగా రెండో ప్రాధాన్య ఓట్లతో కలిపి తెదేపా అభ్యర్థి లక్షా 12 వేల 686 ఓట్లు సాధించారు. వైసీపీ అభ్యర్థి శ్యాంప్రసాద్‌రెడ్డికి 85 వేల 423 ఓట్లు వచ్చాయి. అర్ధరాత్రి వరకూ రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు కొనసాగింది.
Also Read:MLC Ramachandra Reddy: ప్రతి టీచర్ కు ధన్యవాదాలు.. సమస్యల పరిష్కారానికి కృషిచేస్తా
తనకు ఓటు వేసి గెలిపించిన వారికి విజేత కంచర్ల శ్రీకాంత్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతకు ఇదొక నిదర్శనం అని ఆయన అన్నారు.
దాదాపు 38 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందినట్లు చెప్పారు. 2024 లోనూ టిడిపి అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ చేసిన అక్రమాలు అరాచకాలే తన గెలుపుకు దోహదపడ్డాయి అని అన్నారు. దొంగ ఓట్లు వేసి పోలింగ్ రోజున అక్రమాలకు పాల్పడ్డ తానెప్పుడూ భయపడలేదన్నారు. ప్రజలపై నమ్మకం ఉంచానని, దాన్ని నేడు రుజువు చేశారని చెప్పారు. ఎన్నో అక్రమాలు చేసిన వైసీపీకి తగిన బుద్ధిని ప్రజలు ఓటు ద్వారా చెప్పారని తెలిపారు. తన గెలుపు కోసం మూడు నెలలుగా ఎంతో శ్రమించానని…తనకు తోడుగా నిలిచిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తకుకృతజ్ఞతలు తెలిపారు.