తెలుగుదేశం పార్టీ 41 వసంతాలు పూర్తి చేసుకుంది. తెలంగాణలో పార్టీని బలపరిచే లక్ష్యంతో పార్టీ 41వ ఆవిర్భావ సభను హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారు. ఖమ్మం సభ విజయవంతం కావడంతో పార్టీ కార్యకర్తల్లో కొంత ఉత్సాహం వచ్చింది. తాజాగా ఇవాళ హైదరాబాద్‌లో సభ పెడుతున్నారు. తెలంగాణలోనూ పూర్వ వైభవం తీసుకురావాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. నేటి సభకు తెలంగాణతో పాటు ఏపీకి చెందిన ముఖ్య నేతలు కూడా వస్తున్నారు.
Also Read:Gold Price: మహిళలకు గుడ్ న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధర
టీటీడీపీ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ బాధ్యతలు చేపట్టాక పార్టీలో కొంత జోష్ పెరిగింది. ఆయన ఆధ్వర్యంలో వరుసగా సభలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఖమ్మంలో నిర్వహించిన సభ గ్రాండ్ సక్సెస్ అయింది. సభకు చంద్రబాబు కూడా హాజరు కావడంతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. ప్రస్తుతం తెలంగాణలో టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవు. అయితే, బీఆర్ఎస్ , బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ ఉండాలని భావిస్తోంది. ఇవాళ హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ సభ జరగనుంది. జీహెచ్ఎంసీ పరిధిలో టీడీపీకి ముందు నుంచి బలం ఉంది. గతంలో టీడీపీ మహానాడు హైదరాబాద్ లోనే నిర్వహించారు. ఇప్పుడు సభతో హైదరాబాద్ లో టీడీపీ పట్టును నిరూపించుకోవాలని పార్టీ నాయకత్వం యోచిస్తోంది.
Also Read:Strange Incident : ఒకే కాన్పులో నలుగురు.. ఎక్కడో కాదు మన దగ్గరే
రెండు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సహా దాదాపు 15 వేల మంది ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. సభ నిర్వహణకు 12 కమిటీలను ఏర్పాటు చేశారు. కష్టపడి పనిచేసే వారికే ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిక్కెట్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని పార్టీ నేతలకు సమాచారం అందింది.