ఆఫ్ఘనిస్తాన్‌లో మీడియాపై మరోసారి తాలిబన్లు ఉక్కుపాదం మొపుతున్నారు. ఇప్పటికే తాలిబన్లు ఆంక్షల పేరుతో మీడియా గొంతు నొక్కిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 11 నియమాలు పేరుతో కొత్త నిబంధనలు తీసుకొచ్చి మరింతగా అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఆఫ్ఘన్ నుంచి వందలాది జర్నలిస్టులు ఇప్పటికే దేశం వదలివెళ్లిపోయారు. మతానికి విరుద్ధంగా, ప్రభుత్వ పెద్దలకు విరుద్ధంగా కంటెంట్‌ను ప్రచురించకుండా ఉండేందుకు ఈ విధమైన నిబంధనలు తీసుకొచ్చినట్టు విదేశీమీడియా సంస్థలు చెబుతున్నాయి. 11 నియమాలు అమలు చేస్తే మీడియా గొంతు శాశ్వతంగా మూగబోయినట్టే అవుతుందని, అక్కడ జరుగుతున్న అరాచకాలు ఏవీ కూడా బయటకు వినిపించవని, మీడియాలో చూపించే ప్రయత్నం ఏవరూ చేయలేరని మీడియా సంస్థలు చెబుతున్నాయి. ఆఫ్ఘన్లో వందలాది మీడియా సంస్థలు ఇప్పటికే మూసివేశారని, కొన్ని సంస్థలు కూడా ప్రచురణను నిలిపివేసి కేవలం ఆన్లైన్ వార్తలను మాత్రమే అందిస్తున్నట్టు అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి.
Read: చిత్ర పరిశ్రమ వైపు కన్నెత్తి చూస్తే కాలిపోతారు.. జాగ్రత్త : పవన్ హెచ్చరిక