హుజురాబాద్ అభ్య‌ర్ధిని ప్ర‌క‌టించిన కాంగ్రెస్‌…

హుజురాబాద్ నియోజ‌క వ‌ర్గానికి ఉప ఎన్నిక ఈనెల 30 వ తేదీన జ‌ర‌గ‌బోతున్నది.  ఇప్ప‌టికే అన్ని పార్టీలు ప్రచారంలో మునిగిపోయాయి.  అధికార టీఆర్ఎస్, బీజేపీలు ఇప్ప‌టికే అభ్య‌ర్ధుల‌ను ప్ర‌క‌టించాయి.  టీఆర్ఎస్ త‌ర‌పున గెల్లు శ్రీనివాస్ బ‌రిలో ఉంటే, బీజేపీ నుంచి ఈట‌ల రాజేంద‌ర్ పోటీ చేస్తున్నారు.  అయితే, కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే అభ్య‌ర్ధిపై అనేక చ‌ర్చ‌లు జ‌రిగాయి.  మొద‌ట కాంగ్రెస్ అభ్య‌ర్ధిగా కొండ సురేఖ‌ను అనుకున్నా, ఆమె తిర‌స్క‌రించ‌డంతో తెర‌పైకి అనేక పేర్లు వ‌చ్చాయి.  విద్యార్ధి నాయ‌కుడు, ఎన్ఎస్‌యుఐ అధ్య‌క్షుడు బ‌ల్మూరి వెంకట్‌కు హుజురాబాద్ నుంచి పోటీ చేసే అవ‌కాశం క‌ల్పించింది కాంగ్రెస్ పార్టీ.  అధికారికంగా ఈ విష‌యాన్ని కొద్దిసేప‌టి క్రిత‌మే ప్ర‌క‌టించారు.  దీంతో హుజురాబాద్‌లో త్రిముఖ‌పోటీ ఖాయంగా క‌నిపిస్తోంది.  

Read: అది వారి వ్య‌క్తిగ‌తం… ఇద్ద‌రూ నాకిష్ట‌మే…

-Advertisement-హుజురాబాద్ అభ్య‌ర్ధిని ప్ర‌క‌టించిన కాంగ్రెస్‌...

Related Articles

Latest Articles