బాలీవుడ్ లోని ప్రముఖులంతా నిత్యం ఏదో ఒక వివాదంలో ఇరుక్కుపోవడం కామన్ గా మారింది. గతంలోనే కొందరు సెలబ్రెటీలు వివాదాల్లో ఇరుక్కుకొని జైళ్లకు వెళ్లిన సంఘటనలున్నాయి. తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త, బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా సైతం పలు అభియోగాల కింద కేసుల్లో ఇరుక్కున్నారు. అయితే రాజ్ కుంద్రా అశ్లీల సినిమాల రాకెట్ ను నడుపుతున్నారని పోలీసులు అతడిపై ఛార్జ్ షీట్ దాఖలు చేయడం తాజాగా సంచలనంగా మారింది. దీంతో బాలీవుడ్లో మరోసారి కలకలం మొదలైంది.
రాజ్ కుంద్రాపై సంచలన ఆరోపణలు చేసిన శిల్పాశెట్టి..!
ఈ కేసులో ఇప్పటికే పోలీసులు రాజ్ కుంద్రా నుంచి వివరాలను సేకరిస్తున్నారు. ముంబై స్పెషల్ క్రైమ్ బ్రాంచ్ శిల్పాశెట్టి భర్తతోపాటు పలువురిని ఈ కేసులో నిందితులుగా చేర్చి కేసును దర్యాప్తు చేస్తుంది. ఇదే సమయంలో శిల్పాశెట్టి వాంగ్మూలాన్ని ముంబై పోలీసులు సేకరించారు. ఇందులో ఆమె భర్త వ్యవహరశైలి, అతడితో తనకు ఏర్పడిన పరిచయం, సాన్నిహిత్యం వంటి వివరాలను సేకరించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆమె రాజ్ కుంద్రాపై పలు సంచలన ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
పోలీసులు అభియోగిస్తున్నట్లు రాజ్ కుంద్ర పోర్న్ రాకెట్ నడుపుతున్నట్లు తనకు తెలియదని ఆమె స్పష్టం చేసింది. తాను తన సినిమాలతో ఫుల్ బీజీగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ఆయన తన వ్యాపారంలో బీజీగా ఉన్నారని చెప్పారు. నేను ఎప్పుడు కూడా తన వ్యాపారాల్లో కలుగజేసుకోలేదని తెలిపారు. తాను తన సినిమాలపైనే ఫోకస్ పెట్టేదాన్ని అలాంటి సమయంలోనే ఏం చేస్తున్నారనే విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదని చెప్పినట్లు తెలుస్తోంది. ఇలాంటి సమయంలోనే ఆయన ఏదైనా చూసి ఉంటారా? అనే అనుమానాన్ని కూడా ఆమె వ్యక్తం చేయడం గమనార్హం. ఆమె చెప్పిన వివరాలను పోలీసులు రికార్డు చేసినట్లు తెలుస్తోంది.
షాకింగ్ నిజాలు బయటపెట్టిన శిల్పాశెట్టి?
ఇదే సమయంలో అశ్లీల రాకెట్ కేసులో రాజ్ కుంద్రా, అతని సంస్థ ఐటి హెడ్ ర్యాన్ థోర్ప్, మరో ఇద్దరు నిందితులపై పోలీసులు ఛార్జిషిట్ దాఖలు చేశారు. శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా 2019లో భాగస్వామిగా సౌరవ్ కుష్వాహతో ఆర్మ్‌స్ప్రైమ్ మీడియా అనే సంస్థలో చేరారని క్రైమ్ బ్రాంచ్ అధికారులు పేర్కొన్నారు. పూనమ్ పాండే వంటి యాక్టర్ల వీడియోలను ఆర్మ్‌స్ప్రైమ్ మీడియా ప్రసారం చేస్తుందని గుర్తించారు. ఆ వీడియోలన్నీ తమ కోరికపై బయటపెట్టిన వీడియోల్ని మాత్రమేనని శిల్పా తెలిపినట్లు సమాచారం.
ఇదే విషయంపై శిల్పాశెట్టి రాజ్ కుంద్రాను ప్రశ్నించగా దానికి అతడి ఓటీటీ ప్లాట్‌ఫామ్ బాగా పనిచేస్తోందని, మంచి లాభాలు వస్తున్నాయని చెప్పి దాటవేసినట్లు పేర్కొంది. మరోవైపు రాజ్ కుంద్రా అరెస్టుకు కారణమైన బోలీఫేమ్ యాప్ గురించి తనకు ఏమీ తెలియదని శిల్పా పోలీసులకు చెప్పడం గమనార్హం. తాను యూకేలో ఉన్నప్పుడు.. బిగ్ బ్రదర్ షూటింగ్ చేస్తున్నప్పుడు ఫరత్ హుస్సేన్ అనే స్నేహితుడి ద్వారా రాజ్ కుంద్రాను తొలిసారి కలిశానని పోలీసులకు చెప్పింది. ఆ తర్వాత వారిద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడటంతో 2009లో వివాహం జరిగిందని చెప్పింది. ఇక అప్పటి నుంచి రాజ్ కుంద్రా భారత్ లో వివిధ వ్యాపారాలు నిర్వహిస్తున్నారని పోలీసులకు వివరించింది.