యువ నటుడు నాగశౌర్య హీరోగా ఆర్చరీ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం ‘లక్ష్య’. కేతిక శర్మ కథానాయిక. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబరు 10న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రానికి కాలభైరవ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా హాజరైన యువనటుడు శర్వానంద్ ఈ చిత్రం బంపర్ హిట్ గ్యారంటీ అన్నారు. నాగశౌర్య ఈ సినిమా కోసం చాలా డెడికెటెడ్‌గా పనిచేశాడని, తెలుగులో స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్లో వచ్చిన సినిమాలన్నీ హిట్ అయ్యాయని, ఈ మూవీ కూడా సూపర్ హిట్ అవుతుందన్నాడు శర్వానంద్. నాకు నాగశౌర్య ఇన్ స్పిరేషన్. ఈ మూవీ కోసం తను చాలా కష్టపడ్డాడు. కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుందన్నాడు శర్వానంద్. కష్టించే మనస్తత్వం ఉన్న నాగశౌర్యకు ఆల్ ది బెస్ట్ అని విషెస్ చెప్పాడు శర్వానంద్.