Shahrukh Khan : తిరుమల శ్రీవారి సన్నిధిలో షారుఖ్ ఖాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలివుడ్ బాద్షా హీరో షారుఖ్ ఖాన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.. ప్రస్తుతం జవాన్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు.. ఈ క్రమంలో షారుఖ్ తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమలకు వచ్చిన ఆయన శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు.. తన కూతురు సుహానా ఖాన్, నటి నయనతారతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. టీటీడీ అధికారులు షారుఖ్ ఖాన్‌కు ఆలయ ప్రధాన ద్వారం వద్ద స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు…
షారుఖ్ ను చూసేందుకు అక్కడ భక్తులు ఎగబడ్డారు.. కొందరు సెల్ఫీలు కూడా దిగారు.. షారుఖ్ ఖాన్ ఉన్నంతవరకు ఆలయంలో సందడి వాతావరణం నెలకొంది.. షారుఖ్, నయనతార జంటగా నటించిన ‘జవాన్’ చిత్రం ఈ నెల 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. గతనెల 31న విడుదలై ఈ సినిమా ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాలో షారుక్ ఖాన్ తండ్రి కొడుకు రెండు పాత్రల్లో కనిపించనున్నాడు. తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దీపికా పదుకోన్, విజయ్ సేతుపతి, ప్రియమణి, సాన్య మల్హోత్రా, యోగిబాబు, రిధి డోగ్రా కీలక పాత్రలు పోషించనున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు..
Also Read
ఇకపోతే ఇప్పటికే జవాన్ చిత్రయూనిట్ ప్రమోషన్స్ భారీగా చేస్తున్నారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా చెన్నైకు రాగా నేడు ఉదయం షారుఖ్ ఖాన్, నయనతార, మరికొంతమంది చిత్రయూనిట్ తో కలిసి తిరుమలకు వచ్చి వేంకటేశ్వరస్వామి వారి దర్శనం చేసుకున్నారు. షారుఖ్ ఖాన్ తన లైఫ్ లో తిరుమలకు రావడం ఇదే మొదటిసారి. సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు జవాన్ చిత్రం టీం..మొదటిసారి షారుఖ్ ఖాన్ తిరుమలకు రావడంతో ఆలయంలోకి నడిచి వెళ్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి…
#WATCH | Andhra Pradesh: Actor Shah Rukh Khan, his daughter Suhana Khan and actress Nayanthara offered prayers at Sri Venkateshwara Swamy in Tirupati pic.twitter.com/KuN34HPfiv
— ANI (@ANI) September 5, 2023
తాజావార్తలు
-
Telangana High Court: “ఆ పోలీసులను గుర్తించండి”.. అసెంబ్లీ దగ్గర మహిళా ఎమ్మెల్యేల ఘటనపై హైకోర్టు ఉత్తర్వులు..
-
Praveen Kumar: ఏదైనా చేయాలనుంది.. కీలక పదవికి దరఖాస్తు చేసిన టీమిండియా మాజీ పేసర్!
-
Ramayana : రామాయణ ప్రీ పోన్.. మూడు రోజులు ముందుగా థియేటర్స్‌లోకి
-
Pentagon Cyberattack: అమెరికా సైనికుల డేటాబేస్‌లోకి హ్యాకర్లు.. 9 నెలల పాటు తిష్ట.. 27.6 లక్షల మంది డేటా లీక్!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
ట్రెండింగ్
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!